రతన్ టాటా మృతి.. కన్నీళ్లు పెట్టుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు. ఇక రతన్ టాటాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ…