Amaravati capital case postponed to December says supreme court jpg

జైళ్లలో ఖైదీలపై కుల‌వివ‌క్ష స‌రికాదు: సుప్రీంకోర్టు

Supreme Court

న్యూఢిల్లీ : జైళ్లలో కులవివక్షపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనుల అప్పగింత, జైలులో గదుల కేటాయింపునకు సంబంధించిన నిబంధనలను తప్పుబట్టింది. అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను మూడు నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పనులను అట్టడుగు వర్గాలకు అప్పగించడం, వంట చేయడం లాంటి పనులను అగ్ర వర్ణాలకు అప్పగించడం అంటే అది ఆర్టికల్‌ 15ను అతిక్రమించడమేనని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అలాంటి పనులు విభజనకు దారి తీస్తాయని పేర్కొంది. ఖైదీల పట్ల వివక్షకు కులం కారణం కారాదని స్పష్టం చేసింది. అలాంటి వాటిని అనుమతించేది లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అందరికీ పని విషయంలో సమాన హక్కు కల్పించాలని పేర్కొంది. ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసే పనులకు ఖైదీలను అనుమతించకూడదని సూచించింది. ఓ ప్రత్యేక కులం వారిని స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం స్పష్టం చేసింది. కుల ఆధారిత వివక్షకు సంబంధించిన కేసుల పరిష్కారానికి పోలీసులు కూడా శ్రద్ధతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

జైళ్లలో కుల ఆధారిత వివక్ష, విభజన ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని కల్యాణ్​కు చెందిన సుకన్య శాంత సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ఏడాది జనవరిలోనే కేంద్రంతో పాటు ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​ సహా 11 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్పందించిన ఆయా రాష్ట్రాలు ఖైదీలకు కులం ఆధారంగానే పనులు ఇవ్వడం, జైలులో గదులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. జైలు మాన్యువల్స్​లో ఉన్న ఇలాంటి అభ్యంతరకర నిబంధలను సవరించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.

Related Posts
ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ కొత్త ప్రాజెక్ట్‌..
Mars 1

ఎలాన్ మస్క్ యొక్క స్పేస్‌ఎక్స్ ఇప్పుడు మంగళగ్రహం కోసం కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దీని పేరు 'మార్స్‌లింక్'. ఈ ప్రాజెక్ట్, స్పేస్‌ఎక్స్ యొక్క ప్రముఖ ఇంటర్నెట్ సేవ Read more

విజయవంతంగా చంద్రయాన్-3 ప్రయోగం
విజయవంతంగా చంద్రయాన్-3 ప్రయోగం.

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా 2023, ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది . దీంతో చంద్రుడిపై సాఫ్ట్ Read more

నేడు క్యాట్‌లో తెలంగాణ, ఏపీ ఐఏఎస్‌ల పిటిషన్ల పై విచారణ
Inquiry on petitions of Telangana and AP IAS in CAT today

హైదరాబాద్‌: కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశాలతో తెలంగాణ, ఆంధ్రాలో కొనసాగుతున్న ఐఏఎస్,ఐపీఎస్‌ కేడర్​ అధికారులు పునర్విభజన యాక్ట్​ ప్రకారం తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని Read more

చంద్రబాబు బయోపిక్ లో ధనుష్..?
chandrababu dhanush

కోలీవుడ్ దిగ్గజ హాస్యనటుడు చంద్రబాబు జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ నిర్మించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ గోపాల్ వన్ స్టూడియోస్ సన్నద్ధమవుతోంది. తమిళ సినిమా రంగంలో అత్యధిక Read more