teenmar mallanna

మల్లన పై కేసు.

చింత‌పండు న‌వీన్ అలియాస్ తీన్మార్ మ‌ల్ల‌న్నపై అల్వాల్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. ఈ నెల 4న వ‌రంగ‌ల్‌లో జ‌రిగిన బీసీ సభ‌లో ఆయ‌న అగ్ర‌వ‌ర్ణాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలంటూ స్థానిక నేత‌లు చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన‌ట్లు ఇన్‌స్పెక్ట‌ర్ రాహుల్‌దేవ్ వెల్ల‌డించారు. ఇక ఇదే సభ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ పీసీసీ క్ర‌మశిక్ష‌ణా క‌మిటీ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్నకు గురువారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం బీసీ కుల గ‌ణ‌న స‌ర్వే నివేదిక‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టిన విష‌యం తెలిసిందే.
అయితే, ఈ స‌ర్వేలో బీసీల సంఖ్య‌ను త‌క్కువ చేసి చూపించారంటూ ఆయ‌న సొంత పార్టీ స‌ర్కార్‌పైనే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌ల్ల‌న్న చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్‌ను తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలు చేసింది. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు బీసీ జ‌నాభా త‌గ్గ‌డంపై క‌న్నెర్ర చేస్తున్నాయి. దాంతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ కోరుతూ టీపీసీసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.

teenmar mallanna 1
Related Posts
మహబూబాబాద్ మహాధర్నాకు బయలుదేరిన కేటీఆర్
KTR left for Mahabubabad Mahadharna

హైదరాబాద్‌: మానుకోట గిరిజన మహాధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు మార్గంలో మహబూబాబాద్ బయలుదేరారు. రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ సోమవారం గిరిజన Read more

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి
Professor Balakishtar Reddy as the Chairman of Telangana Higher Education Council

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తంను నియమించింది. Read more

కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), Read more

నేడు కుంభమేళాకు వెళ్లనున్న ప్రధాని
PM Modi will go to Kumbh Mela today

ప్రయాగరాజ్‌: ప్రధాని మోడీ ఈరోజు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో ప్రయాగరాజ్‌కు చేరుకోనున్న ప్రధాని, అక్కడి త్రివేణీ సంగమంలో స్నానమాచరించి పూజలు నిర్వహిస్తారని ఆయన కార్యాలయం Read more