పండుగ సీజన్లో మారణహోమం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు

Israel :పండుగ సీజన్లో మారణహోమం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు

ప్రపంచమంతా రంజాన్ సీజన్లో హ్యాపీగా ఉంటే గాజాలో మాత్రం మారణహోమం జరుగుతున్నది. గాజా మిలిటెంట్ గ్రూప్ హమాస్‌పై మరోసారి విరుచుకుపడింది ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డ్రోన్ దాడులతో కల్లోలాన్ని రేపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 69 మంది దుర్మరణం పాలయ్యారు.

Advertisements
పండుగ సీజన్లో మారణహోమం.. గాజాపై ఇజ్రాయెల్ దాడులు


కాల్పుల విరమణ కుదిరిన ఒప్పందం
నిజానికి- హమాస్‌తో ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఇజ్రాయెల్. దీనికి ప్రతిగా ఆ మిలిటెంట్ గ్రూప్ చెరలో బందీలుగా ఉన్న తమ దేశ పౌరులను విడిపించుకోవాలనేది షరతు. దీనికి ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణను కుదుర్చుకున్నాయి. యుద్ధాన్ని నిలిపివేయడానికి కాల్పుల విరమణ కుదిరిన రెండు నెలల తర్వాత ఈ దాడులు తెరమీదికి వచ్చాయి. ఈ రెండు నెలల వ్యవధిలో తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో దాదాపు 60 మందిని విడుదల చేసింది హమాస్.
69 మంది మరణించారు
ఈ పరిస్థితుల్లో తాజా దాడులు చోటు చేసుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. డ్రోన్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. గాజా అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇప్పటివరకు 69 మంది మరణించినట్లు గాజా ప్రకటించింది. మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని స్థానిక మీడియా తెలిపింది.

Related Posts
డొమినికన్ రిపబ్లిక్‌లో భారతీయ విద్యార్థి అదృశ్యం – తాజా అప్‌డేట్
డొమినికన్ రిపబ్లిక్‌లో భారతీయ విద్యార్థి అదృశ్యం – తాజా అప్‌డేట్

అమెరికాలో శాశ్వత నివాసి అయిన భారతీయ విద్యార్థిని సుదీక్ష కోనంకి డొమినికన్ రిపబ్లిక్‌లో రహస్యంగా అదృశ్యమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. కేసులో 24 ఏళ్ల జాషువా రిబే అనే Read more

ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ పర్యటన

భారత్-కువైట్ సంబంధాలకు కొత్త దిశ: ప్రధాని మోదీ చారిత్రాత్మక పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి రెండు రోజుల పాటు కువైట్ పర్యటన చేయనున్నారు. 43 Read more

దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్..
illegal mining

దక్షిణాఫ్రికాలో స్టిల్‌ఫాంటేన్ ప్రాంతంలోని ఒక మూసివేసిన మైనింగ్ షాఫ్ట్ నుండి గత 24 గంటలలో ఆరుగురు అక్రమ మైనర్ల శవాలను కనుగొన్నారు. ఇంకా సుమారు 100 మంది Read more

పాకిస్తాన్ కి తగిన శాస్త్రి జరిగింది.
పాకిస్తాన్ కి తగిన శాస్త్రి జరిగింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టు వివాదాల్లో చిక్కుకుంది. ఆతిథ్య దేశం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఆ జట్టు ప్లేయర్లు ప్రవర్తించిన విధానంపై మండిపడుతున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×