SSC CGL 2025 : పరీక్షలు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయి, పలు కేంద్రాల్లో రద్దయ్యాయి. ఈ నెలలో మళ్లీ నిర్వహించనున్నారు.
ఈసారి SSC CGL 2025 టియర్-1 పరీక్షకు దేశవ్యాప్తంగా 28.14 లక్షలకుపైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. మొత్తం 129 నగరాల్లోని 260 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. అయితే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో పలు కేంద్రాల్లో సిస్టమ్ క్రాష్‌లు, లాగిన్ ఆలస్యం, నిర్వహణలో లోపాల కారణంగా పరీక్షలు రద్దు చేయబడ్డాయి.
కోల్‌కతా (పశ్చిమబెంగాల్)లోని మైండ్ మ్యాట్రిక్స్ సెంటర్, జార్ఖండ్‌లోని బోకారో స్టీల్ సిటీ కేంద్రం, అలాగే జమ్మూలోని డిజిటల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో పరీక్షలు పూర్తిగా రద్దయ్యాయని సంబంధిత ప్రాంతీయ డైరెక్టర్లు ప్రకటించారు. ఈ కేంద్రాల్లో ఒకటి కంటే ఎక్కువ షిఫ్ట్‌లకు హాజరుకావాల్సిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇప్పటికే ఆగస్టులో నిర్వహించాల్సిన ఈ పరీక్షలు సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడ్డాయి. కొత్తగా ఎంపికైన ఎగ్జామ్ కన్డక్టింగ్ ఏజెన్సీ (ECA) సరైన సదుపాయాలు అందించలేకపోవడంతో ఈ గందరగోళం తలెత్తిందని SSC ఛైర్మన్ ఎస్. గోపాలకృష్ణన్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు కారణంగా విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కమిషన్, ప్రభావితమైన అభ్యర్థుల కోసం పరీక్షలను మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కొత్త తేదీలు సెప్టెంబర్ 22 నుంచి 27 వరకు నిర్ణయించబడ్డాయి.
అభ్యర్థులు తమ ప్రాంతీయ SSC వెబ్‌సైట్లను తరచూ పరిశీలించి, కొత్త హాల్ టికెట్లు మరియు మార్గదర్శకాలు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
Read also :