Canadian Prime Minister Justin Trudeau plans to resign

రాజీనామా యోచనలో కెనడా ప్రధాని..!

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం. లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవి నుంచి కూడా ఆయన తప్పుకునే అవకాశముందని సన్నిహిత వర్గాల సమాచారం ఆధారంగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నేషనల్ కాకస్ సమావేశానికి ముందే ట్రూడో రాజీనామా చేయవచ్చని అంచనా వేస్తున్నారు. జస్టిన్ ట్రూడో 2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారంపై ఆయన కార్యాలయం స్పందిస్తే మాత్రమే దీనిపై స్పష్టత రానుంది.

Canadian Prime Minister Justin Trudeau plans to resign
Canadian Prime Minister Justin Trudeau plans to resign

అయితే, జస్టిన్ ట్రూడో తక్షణంగా రాజీనామా చేస్తారా లేక కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోర పరాజయం చెందుతుందని అనేక ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, జస్టిన్ ట్రూడో విధానాలపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, దేశ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేసిన నెల రోజులకే ట్రూడో కూడా రాజీనామా చేసే అవకాశం ఉందనే వార్తలు తెరపైకి వచ్చాయి.కాగా, 2013లో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధాని పదవిని చేపట్టారు. ఇక గత పదేళ్లుగా పదవిలో ఉన్న ట్రూడో ప్రాభవం ఇటీవలి కాలంలో మసకబారుతూ వస్తున్నది. ప్రస్తుతం ట్రూడోపై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పెరుగుతున్న ధరలు, ఇళ్ల సంక్షోభానికి కారణమైన ట్రూడోపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే ఒత్తిడి తీవ్రంగా ఉంది. 2025 అక్టోబర్‌లో కెనడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

Related Posts
Donald Trump: 5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు చేసిన ట్రంప్
5.30 లక్షల మంది లీగల్ స్టేటస్ రద్దు చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్, వలసదారుల విషయంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు.అక్రమ వలసదారులపై ఇప్పటికే కఠిన చర్యలుట్రంప్ ప్రభుత్వం దేశంలో అక్రమంగా Read more

తమ పార్టీ ఒంటరిగా పోటీ : అతిశీ
Our party will contest alone: ​​Atishi

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ గోవాలో మీడియాతో మాట్లాడుతూ.. గోవా, గుజరాత్‌లలో తాము సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు. Read more

భారతదేశం-నైజీరియా సంబంధాలు: పీఎం మోదీ సందర్శన ద్వారా కొత్త మార్గాలు..
images 2

భారత ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియాకు చేసిన సందర్శన, ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్యంగా ఉన్న దేశం (భారతదేశం) మరియు ఆఫ్రికాలో అతిపెద్ద దేశం (నైజీరియా) మధ్య సహకారాన్ని Read more

ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి: వెంకయ్యనాయుడు
venkaiah naidu ntr

తెలుగువారి గర్వకారణమైన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలలో మాట్లాడిన Read more