AP Cabinet meeting on 4th December

రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ జరగాలి. తాజాగా మంగళవారం జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరుగుతుందని.. అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి.. జీఏడీకి పంపించాలని ఆదేశించారు.

కాగా, ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, పేదలకు రేషన్ కార్డులు జారీ, సూపర్ సిక్స్ పథకాలు, ఇసుక పాలసీ, ఎన్నికల హామీలు సహా పలు అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. ఇటీవల సంచలనంగా మారిన అదానీ విద్యుత్ కొనుగోళ్ల లంచం వ్యవహారం, అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర వంటి అంశాలపైనా సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, నవంబర్ 20న క్యాబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Related Posts
‘ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం..గల్లీల్లో తిరిగి చూసే ఓపిక లేదా’ – కేటీఆర్
ktr revanth

రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ సీఎం రేవంత్ ఫై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. . 'ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న సీఎం కు తెలంగాణ గల్లీల్లో Read more

మారిష‌స్‌ చేరుకున్న ప్ర‌ధాని మోడీ
Prime Minister Modi arrives in Mauritius

న్యూఢిల్లీ: ప్ర‌ధాని మోడీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు మారిష‌స్ చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో పోర్టు లూయిస్ విమానాశ్ర‌యంలో ఆయ‌నకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మారిష‌స్‌లో Read more

లడ్డూ వివాదం.. నేడు తిరుమలకి పవన్ కల్యాణ్
Laddu controversy. Pawan Kalyan to Tirumala today

Laddu controversy.. Pawan Kalyan to Tirumala today అమరావతి: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా Read more

ఛాంపియన్స్ ట్రోఫీ ముచ్చటగా 3వ సారి విజేతగా భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ ముచ్చటగా 3వ సారి విజేతగా భారత్

ఛాంపియన్స్ ట్రోఫీ ముచ్చటగా 3వ సారి విజేతగా భారత్ భారత క్రికెట్ జట్టు మరోసారి తన హవా చూపించింది. న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి టీం Read more