Cabinet approves Telangana budget

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

Telangana Budget: తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు బడ్జెట్‌‌ను ఆర్ధిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేబినెట్‌లో ప్రతిపాదించారు. ఈ మేరకు మంత్రి‌వర్గం బడ్జెట్‌ ఆమోద ముద్ర వేసింది. అనంతరం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క , అటు శాసన‌మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోన్న తరుణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందని అటు విపక్షాల్లోనూ.. ఇటు ప్రజల్లోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.

Advertisements
తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటనలు

కాగా, ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా ఆరు గ్యారంటీ ల అమలుపైనే దృష్టి పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ పథకాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రూ.3.20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ‌పెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక, ఆరు గ్యారంటీల్లో ఒకటైన సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఏటా రూ.3,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని, ఈ మేరకు పింఛన్ల బడ్జెట్‌ పెంచుతారని సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి పథకాల కొనసాగింపునకు అవసరమైన మేర నిధులు కేటాయించనున్నారు.

Related Posts
మాజీ మంత్రి హరీశ్ రావుపై మరో కేసు
Another case against former minister Harish Rao

కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్‌ : తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుపై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత Read more

ఢిల్లీ ఎన్నికలు..1 గంట వరకూ 33.31శాతం పోలింగ్‌..
Delhi Elections.. 33.31 percent polling till 1 hour

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 1 Read more

బీసీసీఐ కొత్త నిబంధనలు!
బీసీసీఐ కొత్త నిబంధనలు!1

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమిపై భారత క్రికెట్ బోర్డు తీవ్రంగా స్పందించింది. భారత జట్టుపై బిసిసిఐ కొరడా ఝుళిపించిందని, ఆటపై వారి దృష్టిని తిరిగి పొందడానికి కఠినమైన Read more

YSRCP : దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారు..అసెంబ్లీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం !
speaker ayyannapatrudu anger at Assembly members!

Ayyannapatrudu: ఏపి అసెంబ్లీలో సభ్యుల హజరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన చేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఆశ్చర్యం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×