నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డికి చేదు అనుభవం

రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఉదయం కనగల్ మండలం దర్వేషిపురం వెళ్తుండగా మంత్రి కోమటిరెడ్డిని నల్లగొండ బైపాస్ రోడ్ బాధితులు అడ్డుకున్నారు. బైపాస్ రోడ్డు వల్ల తమ బతుకులు రోడ్డున పడుతున్నాయాంటూ గత కొద్దీ రోజులుగా బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం కనగల్ మండలం దర్వేషిపురం వెళ్తుండగా మంత్రి కోమటిరెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే ఈ విషయంలో తానేమీ చేయలేను అంటూ మంత్రి అనడంతో బాధితులు కాళ్లవేళ్ల పడ్డారు. అవసరమైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని హామీ ఇస్తూ అక్కడి నుంచి మంత్రి వెళ్లిపోయారు.