ఇండియాలో BYD భారీ పెట్టుబడి..టెస్లాకు గట్టి పోటీ

BYD: ఇండియాలో BYD భారీ పెట్టుబడి..టెస్లాకు గట్టి పోటీ

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. తాజాగా అమెరికా దిగ్గజ కార్ల తయారీ సంస్థ టెస్లా త్వరలో ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ తరుణంలో టెస్లాకు ప్రపంచ పోటీదారిగా ఉన్న చైనా కంపెనీ BYD భారతదేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోతోంది. దింతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీగా టెస్లాకు గట్టి పోటీ ఇవ్వనుంది.
కొన్ని సంవత్సరాల క్రితం వరకు టెస్లా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కార్ల అమ్మకాల సంస్థ. అయితే, BYD ఇప్పుడు టెస్లాను అధిగమించి ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే అతిపెద్ద కంపెనీగా అవతరించింది. అంతర్జాతీయ మార్కెట్ల తర్వాత ఈ రెండు ఎలక్ట్రిక్ దిగ్గజాలు ఇప్పుడు భారతదేశంలోనూ ఢీకొనబోతున్నాయి. BYD ప్రస్తుతం భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది – ఆటో 3, సీల్ అండ్ eMax 7 . ఈ కంపెనీ తాజాగా మొదటి ఎలక్ట్రిక్ కారు సీలాయన్ 7 మోడల్‌ను లాంచ్ చేసింది. దీనితో పాటు చాల ఇతర BYD కార్లు కూడా ఇండియాకి వస్తున్నాయి.

Advertisements
ఇండియాలో BYD భారీ పెట్టుబడి..టెస్లాకు గట్టి పోటీ

తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ కార్లు
ప్రపంచ మార్కెట్తో సహా ఇండియాలో కూడా తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త సమాచారం విడుదల అయ్యింది. BYD హైదరాబాద్‌లో దాదాపు రూ.85,000 కోట్ల పెట్టుబడితో కొత్త ఫ్యాక్టరీని నిర్మించాలని యోచిస్తోంది.
మారుతి,టాటా, మహీంద్రాలకు భారీ సవాలు
BYD ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కాకుండా, వాటికి బ్యాటరీలను కూడా తయారు చేయడానికి ఒక ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ తయారీ ప్లాంట్ టెస్లాకే కాకుండా టాటా, మహీంద్రా వంటి భారతీయ ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు ఇంకా భారతదేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతికి కూడా భారీ సవాలును విసురుతుంది.

Related Posts
Smiley Face : ఏప్రిల్ 25న ఆకాశంలో ‘స్మైలీ ఫేస్’ అపూర్వ దృశ్యం
The moon and smiley star

ఈ నెల 25న తెల్లవారుజామున ఆకాశంలో ఒక అద్భుతం చోటుచేసుకోనుంది. ప్రకృతి మనకు ఈసారి అసలైన "స్మైలీ" చూపించబోతోంది. శుక్రుడు, శని మరియు నెలవంక కలిసి ఆకాశంలో Read more

మాజీ కేంద్ర మంత్రి ఇళంగోవ‌న్ మృతి
EVKS

మాజీ కేంద్ర మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవ‌న్ ఇవాళ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 73 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధ‌ప‌డ్డారు. నెల రోజుల Read more

బీహార్‌లో పూలకుండీలు మాయం
బీహార్‌లో పూలకుండిలు మాయం

బక్సర్ జిల్లాలో ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ‘ప్రగతి యాత్ర’లో భాగంగాకు శనివారం బక్సర్‌లో అనేక ప్రాంతాలను సందర్శించారు. ఇందుకోసం ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు సర్క్యూట్ హౌస్ వెలుపల Read more

Tahawwur Rana : తహవ్వుర్‌ రాణా కోసం బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, కమాండోలు
Bulletproof vehicle, commandos for Tahawwur Rana

Tahawwur Rana: కొంతసేపట్లో భారత్‌కు 26/11 ముంబయి దాడుల కీలక సూత్రధారి తహవ్వుర్‌ రాణా రానున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×