ఏడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్‌

By-election polling for assembly seats is ongoing in seven states

న్యూఢిల్లీ : ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు బుధవారం ఓటింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. బీహార్‌లోని రూపాలి, రాయ్‌గంజ్, రణఘాట్ దక్షిణ్, బాగ్ మానిక్తలా (పశ్చిమబెంగాల్‌లో), విక్రవాండి (తమిళనాడు), అమర్‌వార (మధ్యప్రదేశ్), బద్రీనాథ్, మంగ్లార్ (ఉత్తరాఖండ్‌లో), జలంధర్ వెస్ట్ (పంజాబ్)..డెహ్రా, హమీర్‌పూర్, నలాఘర్ (హిమాచల్ ప్రదేశ్)లో పోలింగ్‌ కొనసాగుతుంది.

కాగా, వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయటం, మరికొంత మంది మరణించటంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడతాయి. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు భార్య కమ్లేష్‌ ఠాకూర్‌తోపాటు మరికొంత మంది తొలిసారిగా ఎన్నికల బరిలో దిగారు.