కుంభమేళాకు బస్సులు రద్దు : ఒడిశా ప్రభుత్వం

భువనేశ్వర్: మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ఉత్తర్వులో పేర్కొంది. మహా కుంభమేళా, అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఒడిశా ఆర్టీసీ తెలిపింది. తాజా అప్‌డేట్‌ను అధికారిక వెబ్‌సైట్‌, సోషల్ మీడియాలో సమాచారం ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక నోటీస్‌ను జారీ చేసింది. అయితే ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని గతంలో నిర్ణయించింది.

Advertisements
image

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద తోపులాట జరిగింది. ఈ సంఘటనలో 30 మంది భక్తులు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. పలువురి జాడ కనిపించడంలేదు. అలాగే అగ్నిప్రమాదాలు వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి భక్తుల రద్దీని తగ్గించేందుకు మహా కుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.

Related Posts
Kedarnath : మే 2న కేదార్ నాథ్, 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్
Kedarnath , badrinath templ

చార్ధామ్ యాత్రలో ప్రధానమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఈ ఏడాది మే 2న తెరువనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధికార ప్రతినిధులు ప్రకటించారు. ప్రతి ఏడాది Read more

మన్మోహన్‌కు స్మారకమా..? ప్రణబ్ కుమార్తె విమర్శలు
pranab mukherjee daughter

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ Read more

బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు
supreme court

ఇటీవల కాలంలో క్షణంలో డబ్బు సైబర్‌ నేరాల చేతిలోకి పోతున్నాయి. మన అమాయకత్వాని ఆసరా చేసుకుని సైబర్‌ నేరాల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. డబ్బు పోగొట్టుకున్నా బాధితులకు సుప్రీంకోర్టు Read more

కాబోయే భర్త ఫోటో ను విడుదల చేసిన కీర్తి సురేష్
keerthi wedding

కీర్తి సురేష్ తన కాబోయే భర్త ఫొటోను షేర్ చేసింది. ఆంటోనీతో నా 15 ఏళ్ళ బంధం ఇంకా కొనసాగుతుంది అంటూ కాబోయే భర్తను పరిచయం చేసింది. Read more

×