కుంభమేళాకు బస్సులు రద్దు : ఒడిశా ప్రభుత్వం

భువనేశ్వర్: మహా కుంభమేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు ఒడిశా ప్రభుత్వం రద్దు చేసింది. అనివార్య పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ఉత్తర్వులో పేర్కొంది. మహా కుంభమేళా, అయోధ్యకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఫిబ్రవరి 4 వరకు తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఒడిశా ఆర్టీసీ తెలిపింది. తాజా అప్‌డేట్‌ను అధికారిక వెబ్‌సైట్‌, సోషల్ మీడియాలో సమాచారం ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక నోటీస్‌ను జారీ చేసింది. అయితే ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని గతంలో నిర్ణయించింది.

image

కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్ద తోపులాట జరిగింది. ఈ సంఘటనలో 30 మంది భక్తులు మరణించారు. 60 మందికిపైగా గాయపడ్డారు. పలువురి జాడ కనిపించడంలేదు. అలాగే అగ్నిప్రమాదాలు వంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ రాష్ట్రం నుంచి భక్తుల రద్దీని తగ్గించేందుకు మహా కుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.

Related Posts
సామ్‌సంగ్ గెలాక్సీ భారీ డిస్కౌంట్
samsung

ఒక పూట ఆహారం లేకపోయినా జీవించవచ్చు కానీ స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేకపోతే జీవితమే ఆగిపోయినట్లుగా అవుతుంది. మన బలహీనతల్ని ఆసరాచేసుకుని పలు కంపనీన్లు పలు ఆఫర్లు ఇస్తున్నాయి. Read more

ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం రేవంత్‌ రెడ్డి
33 percent reservation for women in elections.. CM Revanth Reddy

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.550 కోట్ల విలువైన నూతన భవన నిర్మాణాలు, Read more

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
Massive drug bust at Mumbai airport

ముంబయి: కస్టమ్స్ అధికారులు ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో 16.49 కోట్ల విలువైన 1700 గ్రాముల Read more

హైదరాబాద్‌ జూపార్క్‌లో భారీగా పెరిగిన ధరలు
hyderabad zoo park

హైదరాబాద్‌లోని ప్రసిద్ధ నెహ్రూ జంతు ప్రదర్శనశాల (జూపార్క్)లో ప్రవేశ రుసుములను మరియు వివిధ సేవల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ Read more