bullet train

ఏపీకి బుల్లెట్ ట్రైన్.. ?

ఏపీలో బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టబోతోందా..? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలన్నది సీఎం చంద్రబాబు డ్రీమ్. పదేళ్ల నాటి కల ఆయనది. ఇందుకోసం 2014లో ఆయన ప్లాన్ చేశారు. అప్పట్లో సింగపూర్, జపాన్ దేశాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని నిర్ణయించు కున్నారు. ఆలోచన చేశారు కానీ, కార్యరూపం దాల్చలేదు. కాకపోతే బుల్లెట్ ట్రైన్ అనేది సీఎం ఆలోచనలో అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది టీడీపీ. ఈ క్రమంలో తన కలల డ్రీమ్‌ని తెరపైకి తెచ్చారు చంద్రబాబు.

రెండురోజుల కిందట ఢిల్లీకి వెళ్లారు సీఎం చంద్రబాబు. పనిలో పనిగా తన బుల్లెట్ ప్లాన్‌ను మోడీ ముందు పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ప్రధాని నుంచి సానుకూల సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, బుల్లెట్ ట్రైన్ విషయాన్ని రివీల్ చేశారు. అమరావతి, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు సిటీలను కలుపుతూ బుల్లెట్ రైలు రానుందని వెల్లడించారు. చంద్రబాబు స్వయంగా చెప్పడం తో రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Related Posts
శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌
Telangana Governor Jishnu Dev Varma visited Bhadradri Ramaiah

భద్రాచలం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తుల్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత, ఆలయానికి సమీపంలోని ఆంజనేయస్వామి Read more

రెడ్ బుక్ అంటే వైఎస్సార్సీపీకి భయం ఎందుకు?: నారా లోకేష్
రెడ్ బుక్ అంటే వైఎస్సార్సీపీకి భయం ఎందుకు?: నారా లోకేష్

నారా లోకేష్ కోర్టు విచారణకు హాజరైన తర్వాత విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు గుప్పించారు. తమ దావోస్‌ పర్యటనను విమర్శిస్తూ Read more

నితీష్ రెడ్డి కి వైస్ జగన్ అభినందనలు
Jagan congratulates Nitish Reddy

ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో భారత యువ క్రికెటర్ నితీశ్ రెడ్డి అద్భుత సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. ఈ విజయాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ Read more

పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు
pawan ycp

చంద్రబాబు కాల్ కు రెస్పాండ్ అవ్వని పవన్ ఇవాళ తీర్థయాత్రలకు వెళ్లడం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *