ఎస్‌ఆర్‌ నగర్‌ లో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ లో గత కొద్దీ రోజులుగా నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. వరుస హత్యలు నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట మర్డర్ అనేది వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ హాస్టల్ లో దారుణ హత్య జరిగింది. హనుమ హాస్టల్లో ఉంటున్న వెంకటరమణ ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు.

అయితే వెంకటరమణతో పాటు హెయిర్ కట్ షాప్ లో పనిచేసే బార్బర్ గణేష్ కూడా అదే రూమ్ లో కలిసి ఉంటున్నాడు. ఇద్దరు బాగానే ఉండే వారు. అయితే గణేష్ రోజూ మద్యం తాగొచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తుండడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో గణేష్ .. వెంకటరమణపై కోపం పెంచకున్నాడు. అతన్ని ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు.

ఇక వెంకటరమణ పడుకున్న సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో వెంకటరమణ ఒక్కసారి కుప్పకూలి పోయాడు. దీంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం గురించి పక్క రూమ్‌ లో ఉండే యువకులు హాస్టల్‌ యాజమాన్యానికి తెలియజేశారు. హనుమ హాస్టల్ వారు వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు.