brs will always stand by workers ktr 222

కార్మికులకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుంది: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండ‌ర్‌ను కేటీఆర్ ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడే నాయ‌కుడి విలువ తెలుస్త‌ద‌ని కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ కార్మికుల కోసం ఎంతో చేశాడ‌ని ఇవాళ మీరు చెబుతుంటే.. ఇన్ని జేసిండా అని ఆశ్చ‌ర్య‌మేస్తుంద‌ని కేటీఆర్ అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం చెమ‌ట చిందిస్తున్న కార్మికుల‌ గురించి ఏ ముఖ్య‌మంత్రి కూడా ప‌ట్టించుకోలేదు. క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడే నాయ‌కుడి విలువ తెలుస్త‌ది. క్రికెట్ మ్యాచ్‌కు కూర్చున్న‌ట్టు కేసీఆర్ ప్రెస్ మీట్ల కోసం క‌రోనా స‌మ‌యంలో కూర్చునేవారు. సార్ మాట వింటే ధైర్యం వ‌స్త‌ద‌ని అనుకునే వారు చాలా మంది ఉండేవారు. ఆంధ్రాలో కూడా కేసీఆర్ మాట‌ల‌ను ఆస‌క్తిగా విన్న వారు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. 2014 జూన్ 2న కేసీఆర్ అధికారంలోకి వ‌స్తే.. అదే నెల 21న హ‌మాలీల‌ను పిలిచి వారి స‌మ‌స్య‌లపై మాట్లాడిండు. ఇలా హ‌మాలీల‌తో భార‌త‌దేశంలో ఎవ‌రూ లేక‌పోవ‌చ్చు. ఐదేండ్లు సీఎం ప‌ద‌వి చేసినా వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోని సీఎంలు ఉన్నారు.

image

ముఖ్య‌మంత్రి అయ్యాకనే కేసీఆర్‌కు కార్మికుల‌పై ప్రేమ రాలేదు. ఆనాడు కేంద్రంలో యూపీఏలో 2004లో చేరిన‌ప్పుడు కేసీఆర్‌కు ఓడ‌రేవుల ఫోర్ట్ పోలియో ఇచ్చారు. ఆ ఫోర్ట్ పోలియే కావాల‌ని డీఎంకే పంచాయితీ పెట్టింది. నేను ఈ ప‌ద‌వుల కోసం రాలేదు.. తెలంగాణ కోసం వ‌చ్చామ‌ని, వారికి షిప్పింగ్ పోర్ట‌పోలియో ఇవ్వాల‌ని మ‌న్మోహ‌న్ సింగ్‌కు చెప్పిండు కేసీఆర్. 9 నెల‌ల వ‌ర‌కు ఎలాంటి ప‌ద‌వి తీసుకోలేదు. ఆఖ‌రికి పార్ల‌మెంట్‌లో ప్ర‌తిప‌క్ష బీజేపీ.. కేబినెట్‌లో ఫోర్ట్ పోలియో లేని మంత్రి ఉంటాడా..? అని మాట్ల‌డితే మ‌న్మోహ‌న్ సింగ్.. కేసీఆర్‌ని పిలిచి ఫోర్ట్ పోలియో తీసుకోవాలంటే.. తెలంగాణ మీద ముంద‌డుగు వేస్తే తీసుకుంటా అని చెప్పిండు. స‌రే అని చెప్పి.. ఏం ఫోర్ట్ పోలియో కావాల‌ని అడిగారు. కార్మిక శాఖ ఏరికోరి తీసుకొని.. బీడీ కార్మికుల‌కు నాడే దేశ వ్యాప్తంగా వేలాది ఇండ్లు మంజూరు చేశారు. అసంఘ‌టిత కార్మికుల కోసం 2005లో క‌మిటీ వేశారు. తెలంగాణ కోసం మంత్రి ప‌ద‌విని వీడి బ‌య‌ట‌కు వ‌చ్చారు. దాంతో అసంఘ‌టిత కార్మికుల‌ను సంఘ‌టితం చేసే ప‌ని అసంపూర్తిగా మిగిలిపోయింది అని కేటీఆర్ గుర్తు చేశారు.

Related Posts
ఎలాన్ మస్క్ ఆస్ట్రేలియాలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై విమర్శ
elon musk

అమెరికా బిలియనీర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X యొక్క యజమాని ఎలాన్ మస్క్ ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే విధానాన్ని, Read more

పసిఫిక్ సముద్రంలో కనుగొన్న ప్రపంచంలోని అతిపెద్ద కొరల్
coral scaled

పసిఫిక్ సముద్రంలో ప్రపంచంలోని అతిపెద్ద కొరల్ కనుగొనబడింది. ఇది సుమారు 500 సంవత్సరాల వయస్సు కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ కొరల్ కొద్దిగా వింతగా Read more

ఆరవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
WhatsApp Image 2024 11 11 at 10.56.56

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సభ ప్రారంభంలో ప్రశ్నోత్తరాల సెషన్ జరగనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో Read more

కూతుళ్ల‌తో క‌లిసి తిరుమ‌లకు పవన్‌..డిక్ల‌రేష‌న్ ఇచ్చిన డిప్యూటీ సీఎం
Deputy CM gave declaration to Tirumala along with daughters

Deputy CM gave declaration to Tirumala along with daughters. తిరుమల: తిరుమ‌ల శ్రీవారి ప్ర‌స్తాదం ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం Read more