BRS MLAs walk out CM speech

TG Assembly: సీఎం స్పీచ్‌ను వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

TG Assembly : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్‌ను వాకౌట్ చేసి బయటకు వచ్చారు. తమ నాయకుడు కేసీఆర్ చావు కోరుకునే విధంగా సీఎం మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్‌ను మార్చురీకి పంపిస్తాం అన్నారు.. అందుకే సీఎం స్పీచ్ ను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా లాబీలో హరీష్ రావు మాట్లాడుతూ.. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ చావును రేవంత్ రెడ్డి కోరుకున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన కేసీఆర్ చావు కోరుకోవడం తప్పు అని అన్నారు. అందుకే సీఎం స్పీచ్‌ను బహిష్కరించామని హరీష్ రావు తెలిపారు.

Advertisements
సీఎం స్పీచ్‌ను వాకౌట్ చేసిన

ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ దే పాపం

మరోవైపు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని హరీష్ రావు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టలేదు కాబట్టి.. 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారని తెలిపారు. ప్రాజెక్టులు కట్టని కాంగ్రెస్ దే పాపం అని దుయ్యబట్టారు. రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ వెళ్లి ఎందుకు ఒప్పుకొని వచ్చారని ప్రశ్నించారు. పులిచింతల పోతిరెడ్డిపాడు కట్టినప్పుడు తాము కొట్లాడామని హరీష్ రావు పేర్కొన్నారు.

మాది త్యాగ చరిత్ర

ఉత్తమ్ కుమార్ రెడ్డి మౌనంగా ఉండి.. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రి పదవి సాధించారని హరీష్ రావు తెలిపారు. ఈ మధ్య ఉత్తమ్ కుమార్ దంపతులు చంద్రబాబును కలిసి భోజనం చేసి వచ్చారు. ఆ తర్వాత శ్రీశైలం ఖాళీ చేసే లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని ఆరోపించారు. మాది త్యాగ చరిత్ర అయితే.. ఉత్తమ్ కుమార్‌ది ద్రోహ చరిత్ర అని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహం వల్లనే ఈ రోజు పంటలు ఎండుతున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.

Related Posts
Modi : ప్రధాని మోడీ ఏపీ టూర్ వాయిదా
modi ap tour

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత Read more

అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు గంటలపాటు బీసీ గణన పై ప్రజెంటేషన్
images

అసెంబ్లీ కమిటీ హాల్ లో సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘంగా బిసి గణన పై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కమిటీ హాల్లో బిసి గణన పై ప్రజెంటేషన్ Read more

ఉద్యోగుల ఆరోగ్య బీమాపై ప్రభుత్వం గుడ్ న్యూస్
Employee health insurance

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఆరోగ్య బీమా పథకం అమలుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని DME గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చింది. Read more

హైదరాబాద్ లో చికెన్ షాప్ లు బంద్..!
Meat Shops Will Closed

హైదరాబాద్‌లో రేపు (జనవరి 30) చికెన్, మటన్ షాపులు బంద్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు Read more

×