కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

బిఆర్ఎస్ పార్టీ కి మరో షాక్ తగిలింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్..సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కార్పోరేటర్లతో కలిసి ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దీంతో బీఆర్ఎస్ ను వీడిని ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 30కి పడిపోయింది. రేపు బీఆర్ఎస్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ సైతం కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు గాంధీభవన్ లో టాక్ నడుస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో ప్రకాశ్ గౌడ్ భేటీ అయ్యారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ లో చేరతారని అంత భావించారు. ఈ క్రమంలోనే ప్రకాశ్ గౌడ్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ప్రకాష్‌ గౌడ్ మనసు మార్చుకున్నట్లు చర్చ సైతం సాగింది.

కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరారు. 2009, 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ గెలుపొందారు. అయితే 2014 ఎన్నికలనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రకాష్ గౌడ్ చేరిక తో బిఆర్ఎస్ ఎమ్మెల్యే ల సంఖ్య బలం 31 కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది గెలిచారు. వీరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్ ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. దాంతో 38 కు చేరుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ ను ఎమ్మెల్యేలు వీడుతూ కాంగ్రెస్ లో చేరుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది కాంగ్రెస్ లో చేరారు. రాబోయే రోజుల్లో ఇంకెంత మంది చేరుతారో చూడాలి.