కాంగ్రెస్ లోకి బీఅర్ఎస్ ఫ్లోర్ లీడర్

బిఆర్ఎస్ పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు..అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి వరుసగా నేతలు పార్టీ కి గుడ్ బై చెప్పి బిజెపి , కాంగ్రెస్ పార్టీలలో చేరుతున్నారు. బిఆర్ఎస్ లో అత్యున్నత పదవులు అనుభవించిన వారే కాదు కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న వారు సైతం బిఆర్ఎస్ ను వీడుతూ వస్తున్నారు. ఈరోజు కేశవరావు సైతం కాంగ్రెస్ లోకి వచ్చారు.

ఇదిలా ఉండగానే ఆదిలాబాద్ మున్సిపల్ బీఅర్ఎస్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్ తో పాటు అదే పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ ఇమ్రాన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై ఈనెలలో అవిశ్వాస సమావేశం నిర్వహించేందుకు కలెక్టర్ తేదీ ఖరారు చేయగా, అనూహ్యంగా భుక్తాపూర్ (45) వార్డు సీనియర్ కౌన్సిలర్, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ ఇమ్రాన్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బిఆర్ఎస్ లో కౌన్సిలర్ల వరుస రాజీనామాలు, వెంటనే కాంగ్రెస్ లో చేరిపోవడం లాంటి పరిణామాలు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.