BRS farmer protest initiation in Kodangal on 10th of this month

ఈ నెల 10న కొడంగల్‌లో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్ష..

హైదరాబాద్‌: ఈ నెల 10వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో బిఆర్ఎస్ రైతు దీక్ష చేపట్టనుంది. కోస్గిలో జరిగే ఈ దీక్షలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ ఈ దీక్ష నిర్వహించనుంది.

image

కాగా, కేటీఆర్ జనవరి 28న కూడా నల్గొండలో రైతు దీక్ష చేపట్టారు. తాజాగా కొడంగల్ లో మరోసారి రైతు దీక్ష చేపట్టబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్ల రైతులు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైతుల కష్టాలు తెలుసుకొని, రైతులకు అండగా ఉండాలని ఈ రైతు దీక్షలు చేపడుతున్నట్లు బిఆర్ఎస్ పేర్కొంది.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతుందని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. నల్గొండలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించగా.. బీఆర్ఎస్ నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు కొడంగల్ లో రైతు దీక్ష నేపథ్యంలో పోలీసులు అనుమతి ఇస్తారా..? లేక మళ్ళీ హైకోర్టు కి వెళ్ళవలసి వస్తుందా వేచి చూడాలి.

Related Posts
మహాత్మాగాంధీ ఆశయాలకు ప్రమాదం: సోనియా గాంధీ
మహాత్మాగాంధీ ఆశయాలకు ప్రమాదం: సోనియా గాంధీ

మహాత్మాగాంధీ ఆశయాలకు ప్రమాదం: సోనియా గాంధీ BJP, RSSపై విమర్శలు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు బీజేపీ మరియు రైట్-వింగ్ సంస్థలపై Read more

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై గౌతమ్ అదానీ
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై గౌతమ్ అదానీ

పని-జీవిత సమతుల్యత గురించి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆలోచన "ఆసక్తికరమైనది" అని ఆర్పీజీ గ్రూప్ చైర్పర్సన్ హర్ష్ గోయెంకా అన్నారు. "పని-జీవిత సమతుల్యతపై గౌతమ్ Read more

అంబేద్క‌ర్ సేవ‌ల‌ను స్మరించుకున్న చంద్ర‌బాబు
chandrababu Dr. BR Ambedkar

అమరావతి : డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన Read more

అంగన్ వాడీ లకు చీరలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధం
telangana anganwadi

తెలంగాణ రాష్ట్రం అంగన్ వాడీ (Anganwadis) టీచర్లకు, హెల్పర్లకు గిప్ట్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నందున, ప్రతి టీచర్‌కు మరియు హెల్పర్‌కు Read more