Britney Spears

Britney Spears Marriage: తనను తానే పెళ్లి చేసుకుని.. హనీమూన్‌కు వెళ్లిన బ్రిట్నీ స్పియర్స్

అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ (42) గురించి ఇటీవల వార్తల్లో నిలిచింది ఆమె తన భర్త సామ్ అస్ఘరీ (30) నుండి విడిపోయిన విషయం తెలిసిందే వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు అయితే వారి వివాహ బంధం కేవలం 14 నెలలకే ముగిసింది 2023లో విడాకుల కోసం దరఖాస్తు చేసిన ఈ జంట గత మే నెలలో విడాకుల ఒప్పందానికి వచ్చింది ఇప్పుడు బ్రిట్నీ స్పియర్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ ఆసక్తికరమైన పోస్ట్ అభిమానులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది తనను తానే పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపింది అక్టోబర్ 21ని ఆమె తన స్వీయ వివాహం తేదీగా గుర్తించింది ఇది మీకు వింతగా బుద్ధి లేని పని అనిపించవచ్చు కానీ నా జీవితంలో నేను చేసిన అద్భుతమైన నిర్ణయం ఇదే అని బ్రిట్నీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు ఆమె ఈ పోస్ట్‌తో పాటు పెళ్లి గౌను ధరించిన తన ఫొటోలను వీడియోలను షేర్ చేశారు ఆసక్తికరంగా వీడియోలో ఆమె నవ వధువు లాగా కనిపిస్తుండగా పక్కన ఎవరూ లేకపోవడం గమనార్హం ఆమె ఖాళీగా ఉన్న చర్చ్ ఫోటోలను కూడా షేర్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.

అంతేకాదు బ్రిట్నీ తన సోషల్ మీడియా ఖాతాలో మరో పోస్ట్ చేసింది ఈ సారి ఒంటరిగా హనీమూన్‌కు బయలుదేరుతున్నట్లు తెలిపింది తన విమానం పక్కన నిలబడి తీసుకున్న ఫొటోను ఆమె పంచుకుంటూ టక్స్‌ అండ్ కేక్స్‌ నేను వచ్చేశా అని వ్యాఖ్యానించింది టక్స్‌ అండ్ కేక్స్ అనేది అట్లాంటిక్ సముద్రంలో ఉన్న దీవుల పేరు ఈ పోస్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి బ్రిట్నీ జీవితంలో జరిగిన ఈ వింత సంఘటన గురించి తెలుసుకున్న అభిమానులు కూడా షాక్‌కు గురయ్యారు ఇప్పటి వరకు బ్రిట్నీ స్పియర్స్‌కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి ఇది నాలుగో సారి అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

    Related Posts
    నయనతారకి లీగల్ నోటీసులు!
    నయనతారకి లీగల్ నోటీసులు!

    ప్రముఖ "లేడీ సూపర్ స్టార్" నయనతార ప్రస్తుతం వివాహ డాక్యుమెంటరీ "నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్" విడుదలైన తర్వాత వివిధ సమస్యల్లో చిక్కుకున్నారు. ఈ డాక్యుమెంటరీ Read more

    తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా
    తొలి చిత్రానికి సంతకం పెట్టిన మోనాలిసా

    ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా వేడుకలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.16 ఏళ్ల మోనాలిసా పూసలమ్మకుంటే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది.ఆమె అందంతో మైండ్ Read more

    పట్టుదల మూవీ ప్రజలను ఆకట్టుకుందా లేదా
    పట్టుదల మూవీ ప్రజలను ఆకట్టుకుందా లేదా

    అర్జున్ (అలియాస్ అజిత్) మరియు కయాల్ (అలియాస్ త్రిష) ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. గడిచిన పన్నెండు సంవత్సరాల అనంతరం కయాల్ తన వైవాహిక బంధం నుంచి Read more

    వరుణ్ ధావన్ రాబోయే చిత్రం బేబీ జాన్,
    baby john

    బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బేబీ జాన్'పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కలీస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *