Britains King Charles 3 was shocked in the Australian Parliament

ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3కు షాక్‌..!

కాన్బెర్రా: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బ్రిటన్‌ రాజు కింగ్‌ ఛార్లెస్‌-3కు షాక్‌ ఎదురైంది. ఆ దేశానికి అధికారికంగా పాలకుడైన ఆయన సోమవారం పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడటం పూర్తయిన వెంటనే స్థానిక ఆదివాసీ సెనెటర్‌ లిడియా థోర్పే రాచరికానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ”మా భూమిని తిరిగి ఇచ్చేయండి. మా నుంచి దోచుకొన్నవి మొత్తం వాపస్‌ ఇవ్వండి. ఇది మీ భూమి కాదు.. మీరు మా రాజూ కాదు. ఆస్ట్రేలియా ఆదివాసీలపై ఐరోపా వలసదారులు నరమేధానికి పాల్పడ్డారు” అని ఆమె దాదాపు నిమిషం పాటు పెద్దపెద్దగా కేకలు వేశారు. వలస విధానాన్ని థోర్పే ఎప్పుడూ వ్యతిరేకిస్తారని పేరుంది.

2022లో థోర్పే ప్రమాణ స్వీకార సమయంలో కూడా వలస రాజ్యపాలకురాలంటూ క్వీన్‌ ఎలిజిబెత్‌-2ను అభివర్ణిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నాటి ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ సు లిన్స్‌ ఆమెను ఉద్దేశించి ”సెనెటర్‌ థోర్పే.. మీరు ప్రమాణస్వీకారం కార్డులో ప్రచురించిన అంశాన్ని మాత్రమే చదవాలి” అని సరిచేశారు.

ఆస్ట్రేలియా రాణి హోదా నుంచి క్వీన్‌ ఎలిజిబెత్‌-2ను తప్పించి.. పార్లమెంట్‌ సభ్యులు ఎన్నుకొన్నవారిని నియమించేలా 1999లో ఓటింగ్‌ జరిగింది. నాడు స్వల్ప మెజార్టీతో ఈ తీర్మానం వీగిపోయింది. మరోవైపు దేశంలో ఆదివాసీ కన్సల్టేటీవ్ అసెంబ్లీ ఏర్పాటుకు తీర్మానాన్ని కూడా 2023లో పార్లమెంట్‌ భారీ మెజార్టీతో తిరస్కరించింది.

ఆస్ట్రేలియా దాదాపు 100 ఏళ్లకు పైగా బ్రిటన్‌ వలస రాజ్యంగా ఉంది. ఈ సమయంలో వేలమంది ఆదివాసీ ఆస్ట్రేలియన్లు హత్యలకు గురయ్యారు. ఆ తర్వాత 1901లో ఆ దేశం అప్రకటిత స్వాతంత్ర్యం సాధించింది. కానీ, పూర్తిస్థాయి రిపబ్లిక్‌గా ఏర్పడలేదు. ప్రస్తుతం దానికి కింగ్‌ఛార్లెస్‌-2 రాజుగా వ్యవహరిస్తున్నారు. ఆయన తాజాగా ఆస్ట్రేలియా, సమవో దేశాల్లో తొమ్మిది రోజుల పర్యటన మొదలుపెట్టారు.

Related Posts
ప్రపంచంలోని అతిపెద్ద ఐస్‌బర్గ్ A23a మళ్లీ కదలడం ప్రారంభించింది
ice berg

ప్రపంచంలోని అతిపెద్ద ఐస్‌బర్గ్ అయిన A23a ప్రస్తుతం దక్షిణ సముద్రంలో తేలుతున్నది.కొన్ని నెలలుగా అడ్డంకులు ఎదుర్కొని కదలడాన్ని ప్రారంభించింది. A23a 1980ల నుండి "ప్రస్తుతం ఉన్న అతిపెద్ద Read more

సమర్థులైన వ్యక్తులే మాకు అవసరం: ట్రంప్
trump

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ మున్ముందు పలు ఛాలెంజ్ విధానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిన్న డొనాల్డ్ ట్రంప్ H-1B లపై మాట్లాడుతూ H-1B విదేశీ Read more

నిర్మాత మనో అక్కినేని కన్నుమూత
Producer Mano Akkineni pass

తమిళ సినీ పరిశ్రమ ప్రముఖ నిర్మాతగా పేరు పొందిన మనో అక్కినేని ఈ నెల 19న కన్నుమూశారు. అయితే ఈ విషాదకర సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Read more

పవిత్రతో రిలేషన్ షిప్ పై నరేష్ ఆసక్తికర కామెంట్స్
naresh pavitra

సీనియర్ నటుడు నరేష్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి పవిత్ర రావు తన జీవితంలోకి వచ్చాక, తన జీవితం కాస్త మెరుగుపడిందని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *