డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌

Boxer Nikhat Zareen took charge as DSP

హైదరాబాద్‌: బాక్సర్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగం లభించింది. తెలంగాణ డీజీపీ జితేందర్ చేతుల మీదుగా డీఎస్పీగా నియామక పత్రాన్ని నిఖత్ అందుకున్నారు. గత నెల 1వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో సెక్షన్ 4లోని తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్‌కు సవరణ చేసి నిఖత్‌కు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా హోంశాఖను ప్రభుత్వం ఆదేశించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్, ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ మెడల్‌ గెలుచుకున్నారు.

ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. దీంతో స్పోర్ట్స్ కోటా కింద నిఖత్ జరీన్‌ను డీఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆమె డీఎస్పీ (స్పెషల్ పోలీస్)గా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసింది.