anil

పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్..

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. గుంటూరు నగరంలో విద్యాసంస్థలకు చెందిన కర్లపూడి బాబూ ప్రకాశ్‌ను రూ.లక్షల్లో డిమాండ్‌ చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్హాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

వైసీపి అనుకూల వ్యక్తిగా, జగన్ వీరాభిమానిగా బోరుగడ్డ అనిల్ కు గుర్తింపు ఉంది. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతలను ఉద్దేశించి బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కల్యాణ్ వంటి నేతలను కూడా ఇష్టంవచ్చినట్టు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినా సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా సోషల్ మీడియా లో ప్రచారం చేసుకునేవాడు. తన అనుయాయులతో కలిసి రోడ్లపై నానా హంగామా సృష్టించేవాడు. అనిల్‌పై గతంలో పట్టాభిపురం, అరండల్‌పేట సహా పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఫోన్‌ చేసి జగన్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావని బెదిరింపులకు గురిచేశాడు.

Related Posts
జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ కాదు ఫ్యామిలీ దావత్‌ – కేటీఆర్
KTRs brother in law Raj Pa

ఆదివారం ఉదయం నుండి జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ పై పెద్ద ఎత్తున ఆరోపణలు , ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ బావమరిది Read more

తన విజయం సందర్భంగా మెలానియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
melania

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన విజయం ప్రసంగంలో అతని భార్య అయిన మెలానియాకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ప్రసంగం మధ్యలో,ట్రంప్ Read more

ఎంపీడీవోపై దాడి.. నిందితులకు రిమాండ్
MPDO attack

అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు‌పై దాడి కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి సహా ఇతరులపై న్యాయమూర్తి కఠిన నిర్ణయం తీసుకున్నారు. Read more

స్వయం ఉపాధి రుణ పథకాల్లో కీలక మార్పులు
స్వయం ఉపాధి రుణ పథకాల్లో కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు (బీసీ) మరియు ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యుఎస్) పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారించి, స్వయం ఉపాధి సబ్సిడీ రుణ పథకాలకు కొత్త Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *