Bomb threats.Bomb squad checks at CRPF school in Secunderabad

బాంబు బెదిరింపులు..సికింద్రాబాద్‌లోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వద్ద బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

హైదరాబాద్‌: ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు సోమవారం అర్ధరాత్రి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో సికింద్రాబాద్ జవహర్‌ నగర్‌ పరిధిలోని సీఆర్పీఎఫ్‌ పాఠశాల వద్ద బాంబ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్పీఎఫ్‌ పాఠశాలలకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు కాల్ రావడంతో నగరంలోని పోలీసులు అప్రమత్తమయ్యారు.

పాఠశాలకు చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పాఠశాలలోని పిల్లలను క్షేమంగా వారి వారి ఇళ్లకు స్కూల్‌ యాజమాన్యం పంపించింది. ఘటనా స్థలికి రాచకొండ సీపీ సుధీర్ బాబు, కుషాయిగూడ ఏసీబీ మహేశ్‌ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

కాగా, ఆదివారం దేశరాజధానిలోని రోహిణిలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన మరుసటిరోజే దేశవ్యాప్తంగా అన్ని సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు, యాజమాన్యం అప్రమత్తమైంది.

Related Posts
వారం పాటు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత..ఎందుకంటే..!!
gachibowli flyover closed

హైదరాబాద్‌లోని వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ అధికారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు Read more

బాలకృష్ణ ఫిట్నెస్ రహస్యం ఏంటో తెలుసా..?
balakrishna fitness

నందమూరి బాలకృష్ణ వయసు 64 కు చేరుకున్న..ఇప్పటికి యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు. వరుస హిట్ల తో ఫుల్ స్వింగ్ లో ఉన్న బాలయ్య ను చూసి Read more

ఒకే నేరానికి 3 FIRలా?..పొలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
patnam

లగచర్ల ఘటనలో BRS నేత పట్నం నరేందర్రెడ్డిపై మూడు FIRలు నమోదుచేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఫిర్యాదుదారు మారిన ప్రతిసారీ కొత్త FIR పెట్టడం ఎలా సమర్థనీయమని పోలీసులను Read more

జల్లికట్టు పోటీలు షురూ.. గెలిస్తే లక్షల్లో బహుమతి
jallikattu

మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు తమిళుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గ్రామాల్లో ఉత్సాహపూరిత వాతావరణాన్ని సృష్టించాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *