Bomb threat to Air India flight. Emergency landing

ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

న్యూఢిల్లీ: ముంబయి నుంచి న్యూయార్క్‌ వెళ్తున్న ఎయిర్‌ విమానం ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు. సోమవారం ఉదయం ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏఐ119 విమానం ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్నది. ఈ క్రమంలో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు రావడంతో సిబ్బంది ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. అనంతరం ప్రయాణికులను అంతా దించివేసి.. ఐసోలేషన్‌ రన్‌వేకు తరలించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.

ఇదే విషయపై ఎయిర్‌ ఇండియా సంస్థ స్పదించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు విమానాన్ని ఢిల్లీకి మళ్లించామని సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు.

Related Posts
హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ నేపథ్యంలో సీఎం రేవంత్ అలర్ట్
hmpv virus

కరోనా వైరస్‌తో ప్రపంచం ఇబ్బంది పడిన తర్వాత, ఇప్పుడు హెచ్‌ఎంపీవీ (HMPV) అనే కొత్త వైరస్ భయాన్ని పెంచుతోంది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందిన ఈ వైరస్, Read more

రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ అథ్లెట్
Dipa Karmakar

రియో ఒలింపిక్స్-2016లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్న భారత స్టార్ జిమ్నాస్టిక్ అథ్లెట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2011 నేషనల్‌ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో గోల్డ్ Read more

వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్
vizag metro

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ మరియు విజయవాడ మెట్రో ప్రాజెక్టుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో నిర్మాణం ద్వారా నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంతో పాటు, ప్రజలకు Read more

భారతీయ మార్కెట్లోకి జేవీసీ
JVC into the Indian market

· ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13, 2025న ప్రారంభమవుతుంది. · రూ. 11,999 నుండి ప్రారంభమయ్యే అద్భుతమైన మేడ్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *