Bomb blast near Pakistan border... Two soldiers killed!

పాక్‌ సరిహద్దు వద్ద బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్ల మృతి !

ఉగ్రవాదుల కోసం గాలింపు..

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో ఐఈడీ పేలుడు సంభవించింది. అక్నూర్ సెక్టార్‌లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ సమయంలో భారత్-పాక్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్.. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అక్నూర్ సెక్టార్‌లోని లాలియాలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్-ఐఈడీ పేలినట్లు సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది.

image

ఈ ఘటన జరిగిన వెంటనే అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ.. ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది. భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం గస్తీ కాస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు తెలిపింది. ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సైనికులకు వైట్ నైట్ కార్ప్స్ ట్విటర్ వేదికగా సెల్యూట్ చెప్పింది. వారి త్యాగాలు గుర్తుండిపోతాయని పేర్కొంది.

ఈ ఘటనను భద్రతా బలగాలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అక్కడ దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇవాళ అక్నూర్ సెక్టార్‌లో మోర్టార్ షెల్‌ను భద్రతా బలగాలు విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. నమందార్ గ్రామంలోని ప్రతాప్ కెనాల్ వద్ద ఈ మోర్టార్ షెల్‌ను చూసిన స్థానికులు సైన్యానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సైన్యం.. ఆ మోర్టార్ షెల్ పేలకముందే దాన్ని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Related Posts
హైపర్ లూప్ ట్రాక్ రెడీ: అశ్వినీ వైష్ణవ్
హైపర్ లూప్ ట్రాక్ రెడీ: అశ్వినీ వైష్ణవ్

భారత్ లో రైల్వేలు వేగంగా మారిపోతున్నాయి. సంస్కరణల కోసం గత కొన్నేళ్లుగా రైల్వేశాఖ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలితాలు అందిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే వందే భారత్ Read more

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు
శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు

శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు:- ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఢిల్లీ, Read more

Uber: ఫ్లయిట్ మిస్సయితే ఉబర్ పరిహారం చెల్లిస్తుంది
Uber: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ – ఉబర్ నుంచి ట్రాఫిక్ భీమా!

విమాన ప్రయాణికులకు ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేసే దిశగా, ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ ఓ కొత్త సేవను ప్రారంభించింది. 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' Read more

గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్: సీఎం
గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్: సీఎం

దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) సదస్సులో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ను గూగుల్ క్లౌడ్ వంటి సాంకేతిక సంస్థలకు వ్యూహాత్మక కేంద్రంగా Read more