prakash raj bolishetty 1

హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది – బొలిశెట్టి

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ అని ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. తిరుమల లడ్డు విషయంలో ప్రకాష్ రాజ్..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వరుస ట్వీట్స్ చేస్తూ అభిమానుల్లో ఆగ్రహం పెంచుతూ వస్తున్నారు. ఈ తరుణంలో సుప్రీం కోర్ట్ ఈ లడ్డు వ్యవహారం లో ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేయడం తో కూటమి శ్రేణులు సుప్రీం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..వైసీపీ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ తరుణంలో ప్రకాష్ రాజ్ ..పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి.. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, కదా? ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి. అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ పవన్‌ కళ్యాణ్ గురించే అని, దీక్షలు చేయడం మానేసి పరిపాలన పై దృష్టి పెట్టాలి అంటూ ప్రకాష్ రాజ్ పరోక్షంగా పవన్‌ కళ్యాణ్‌పైప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్కు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కౌంటరిచ్చారు. ‘భక్తుడి గురించి మాట్లాడే ధైర్యం చేసిన మీరు కోర్టు విచారణ నుంచి తప్పించుకు తిరుగుతున్న నేరారోపితుడు జగన్కి కోర్టుకు హాజరవాలని చెప్పే సాహసం ఎందుకు చేయలేదు. గొడ్డలికి భయపడా? హిందూ మతం అంటే ప్రతీవాడికీ లోకువైపోయింది. మత అపచారాలకు సాక్ష్యాలుండవు. ఆ విషయాలు కోర్టులో తేలవు’అని ట్వీట్ చేశారు.

Related Posts
‘గ్రూప్-2’ పరీక్షలో చంద్రబాబు , తెలంగాణ తల్లిపై ప్రశ్నలు
group2 exam

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో ప్రశ్నలు విభిన్నంగా వచ్చాయి. వీటిలో ముఖ్యంగా తెలంగాణ తల్లి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నిజాం సాగర్ వంటి అంశాలపై Read more

పుతీన్‌తో రాజ్‌నాథ్‌సింగ్‌ సమావేశం
Rajnath Singh high level meeting with Russian President Putin

మాస్కో: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం రష్యాకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో Read more

ఇండియన్స్ కి ఇకపై ఉద్యోగాలు బంద్ అంటున్న ట్రంప్
ఇండియన్స్ కి ఇకపై ఉద్యోగాలు బంద్ అంటున్న ట్రంప్

భారతీయ విద్యార్థుల్లో అమెరికాలో చదువుకునే అంగీకారం రోజుకో రోజు పెరిగిపోతుంది.వీరి మధ్య ప్రత్యేకంగా వర్కింగ్ వీసాతో వెళ్లే వాళ్లకు కొంత సౌకర్యం ఉంటుందని చెప్పవచ్చు.అయితే, లక్షల రూపాయల Read more

బడ్జెట్ లో ఏ రంగానికి ఎంతెంత!
nirmala

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీయే కూటమి సభ్యుల హర్షధ్వనాల మధ్య పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో రికార్డు స్థాయి బడ్జెట్ ను Read more