Board of Intermediate Nirwakam..Students are in serious trouble

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం.. విద్యార్థులకు ఇబ్బందులు

ఇంటర్ మెమోలలో తప్పుగా ప్రింట్ అయిన ఫొటోలు..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగు చూసింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేలా చేసింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసిన తప్పు వల్ల విద్యార్థులకు మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. దీంతో కళాశాలల్లో చేరిన విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2024 లో ఇంటర్మీడియట్ పాస్ అయిన 60 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్మీడియట్ మెమోలలో ఫోటోలు తప్పుగా వచ్చాయి. ఈ విద్యార్థులంతా ప్రభుత్వ బిసి వెల్ఫేర్ జ్యోతిరావు పూలే కళాశాలకు చెందిన వారే కావడం గమనార్హం.

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం

బీటెక్ కాలేజీలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత విద్యార్థులు

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని ఉయ్యాలవాడ బిసి వెల్ఫేర్ జ్యోతిరావు పూలే,కోడేరు బీసీ వెల్ఫేర్ జ్యోతిరావు పూలే విద్యార్థులు. మెమోల్లో విద్యార్థుల ఫొటోలు తప్పుగా ప్రింట్ అయిన ఘటనపై స్పందించారు డిఐఈఓ వెంకటరమణ. తమ నుంచి ఎలాంటి తప్పు లేదని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచే సరి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. విద్యార్థులంతా వివిధ బీటెక్ కళాశాలలో చేరినప్పటికీ మెమోలు సరిగా లేకపోవడంతో కళాశాలలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి మెమోలను సరిచేయాలని విద్యార్థులు కోరారు.

పరిష్కరించేందుకు తగిన చర్యలు

ఈ తప్పుడు ప్రింట్‌తో, చాలా కళాశాలలు విద్యార్థులను అంగీకరించడంలో ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే, యూనివర్సిటీల లేదా కళాశాలల ప్రాతినిధ్యం ద్వారా అనుకున్న ఆత్మనిర్ణయ ప్రక్రియకు ఈ మెమోలు మూలకంగా అంగీకరించబడదు. అవి సరిచేయడానికి వాయిదాలు కలిగినప్పటికీ, విద్యార్థులు వెంటనే దీనిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related Posts
ట్రంప్ విజయం తర్వాత టెస్లా షేర్స్ 15% పెరిగాయి..
elon musk

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడానికి తరువాత, ఎలాన్ మస్క్‌ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన టెస్లా షేర్స్ 15% పెరిగాయి. ట్రంప్ Read more

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసులు మృతి
Road accident in America. Five Indians died

రోడ్డు ప్రమాదాలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్యగా మారింది. ఇవి ప్రమాదకరమైన పరిస్థితులు, మరణాలు, గాయాలు, ఆర్థిక నష్టం మరియు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. Read more

గుజరాత్‌ ప్రజలు కొత్త విజన్‌ కోసం వేచి చూస్తున్నారు: రాహుల్‌ గాంధీ
People of Gujarat are waiting for a new vision.. Rahul Gandhi

ఆహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్‌ గాంధీ ప్రసంగించారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను, నేతలను గుర్తించాల్సిన అవసరం Read more

Konda Surekha : 18 మంది సభ్యులతో వైటీడీ ట్రస్టు బోర్డు ఏర్పాటు
Konda Surekha 18 మంది సభ్యులతో వైటీడీ ట్రస్టు బోర్డు ఏర్పాటు

Konda Surekha : 18 మంది సభ్యులతో వైటీడీ ట్రస్టు బోర్డు ఏర్పాటు తెలంగాణ ప్రభుత్వంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి Read more