ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

ఎడ్ల బండ్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

హైరదాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నాయి. లగచర్ల రైతులకు సంఘీభావంగా చేతులకు బేడీలు, ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు బీజేపీ రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎడ్లబండ్లపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎడ్ల బండ్లపై బయలుదేరారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం నిరాకరిస్తుందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

ఇక అటు అసెంబ్లీకి ఆకు పచ్చ కండువాలతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వచ్చారు. రైతాంగ సమస్యలపై రైతు కండువాలు వేసుకొని అసెంబ్లీలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా , బోనస్ పై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం తీసుకున్నారు.

Related Posts
తిరుపతిలో తొక్కిసలాట.. మృతుల వివరాలు
The details of the deceased

తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధువారం జరిగిన తొక్కిసలాట ఘటనా అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చిన కారణంగా Read more

మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు
madrasas

బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత, ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో మాట్లాడుతూ దేశానికి అతివృష్టి, అనావృష్టి రెండూ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఫెడరలిజం వల్ల అన్ని మతాలు, పండుగలు, Read more

ఢిల్లీ కొత్త సీఎం ప్ర‌మాణం స్వీకారానికి టైం ఫిక్స్
NKV BJP

ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేడుకకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22వ తేదీ గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఈ Read more

Raghunandan : తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష తగదు: రఘునందన్ రావు
TTD discrimination against Telangana public representatives is inappropriate.. Raghunandan Rao

Raghunandan : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది వెళ్తుంటారు. దేశ విదేశాల నుంచి కూడా వెంకన్న దర్శనాకి భక్తులు వస్తారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *