BJP income is 4,340 crores!

బీజేపీ ఆదాయం 4340 కోట్లు

2023-24 ఏడీఆర్‌ నివేదిక

న్యూఢిల్లీ : బీజేపీ ఆదాయం 4340 కోట్లు.2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే కమలం పార్టీ ఆదాయం 83.85 శాతం పెరిగింది. దేశంలోని 6 జాతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.5,820.91 కోట్ల విరాళాల్లో బీజేపీ వాటా 75 శాతం కావడం గమనార్హం.

బీజేపీ ఆదాయం 4,340 కోట్లు
బీజేపీ ఆదాయం 4340 కోట్లు

రూ.1225.11 కోట్లతో కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానం

ఈ మేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌) సోమవారం తన నివేదికలో వెల్లడించింది. రూ.1225.11 కోట్లతో కాంగ్రెస్‌ పార్టీ రెండోస్థానంలో నిలిచింది. హస్తం పార్టీ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 170.82 శాతం పెరుగుదలతో 772.74 కోట్లు ఎక్కువ విరాళాలు పొందింది. ఆ తర్వాత రూ.167.63 కోట్లతో సీపీఐ(ఎం), రూ.64.77 కోట్లతో బీఎస్పీ, రూ.22.68 కోట్లతో ఆప్‌, రూ.22.44 లక్షలతో ఎన్పీపీ వరుసగా నిలిచాయి.

బీజేపీ ఖర్చులు 50 శాతమే..

బీజేపీ తన ఆదాయంలో రూ.2,211.69 కోట్లు (50.96 శాతం) వ్యయం చేయగా.. కాంగ్రెస్‌ పార్టీ రూ.1025.24 కోట్లు (83.69 శాతం) ఖర్చు చేసినట్టు ఏడీఆర్‌ తెలిపింది. సీపీఐ (ఎం) రూ.127.28 కోట్లు (75.93 శాతం), బీఎస్పీ రూ.43.18 కోట్లు (66.67 శాతం) ఖర్చు చేశాయి. ఆప్‌, ఎన్పీపీ తమ ఆదాయానికి మించి ఖర్చులు చేసినట్టు ఏడీఆర్‌ నివేదించింది. ఆప్‌ రూ.34.09 కోట్లు ఖర్చు చేసింది. జాతీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో ఎక్కువ ఆదాయం సమకూరింది. బీజేపీకి రూ.3,967.14 కోట్లు, కాంగ్రెస్‌ రూ.1,129.66 కోట్లు, సీపీఐ (ఎం) రూ.74.68 కోట్లు, ఆప్‌ రూ.22.13 కోట్లు పొందాయి.

బీజేపీ ఆదాయం లో భారీ పెరుగుదల

2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ యొక్క ఆదాయం గణనీయంగా పెరిగింది. 83.85 శాతం పెరిగిన ఆదాయం, దేశంలోని రాజకీయ చరిత్రలో క్షేత్రస్థాయి విరాళాల విషయంలో ప్రభావవంతమైన మార్పులను చాటిచెప్పింది. 4,340.47 కోట్ల రూపాయలు పొందిన బీజేపీ, ఈ స్థాయిలో ఆదాయం సమకూర్చుకోవడం ఇతర జాతీయ పార్టీలకు కూడా సంకేతాన్ని ఇచ్చింది. భారతదేశంలో రాజకీయ పార్టీలు విరాళాలను సమకూర్చే పద్ధతులపై పారదర్శకత పెరిగినప్పటికీ, భారీగా పెరిగిన డొనేషన్లకు ఉన్న కారణాలు ఇంకా అనేక చర్చలకు దారితీస్తున్నాయి.

Related Posts
పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్
PepsiCo India Revolutionary Awards

వ్యవసాయ రంగానికి తోడ్పడుతున్న మహిళలను ప్రశంసించే విలక్షణమైన వేదిక రివల్యూషనరి అవార్డ్స్, పెప్సికో ఇండియా వారిచే ప్రారంభించబడింది. హైదరాబాద్‌: తెలంగాణ నుండి గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్ (SHG) Read more

ఈ సంవత్సరం ఉద్యోగాలలో నియమించబడిన 10% మంది ఉద్యోగుల ఉద్యోగ శీర్షికలు 2000లో లేవు..కనుగొన్న లింక్డ్ఇన్ యొక్క వర్క్ చేంజ్ స్నాప్‌షాట్‌
10 of Employees Hired in Jobs This Year Had Job Titles That Didnt Exist in 2000 LinkedIns Work Change Snapshot Finds

· భారతదేశంలోని 82% వ్యాపార నాయకులు కొత్త విధులు , నైపుణ్యాలు మరియు సాంకేతికతలకు డిమాండ్ పెరుగుతున్నందున పనిలో మార్పుల వేగం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. · Read more

Stalin: జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరగకూడదన్న స్టాలిన్
Stalin: డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలను దెబ్బతీస్తుంది - స్టాలిన్ ఆందోళన

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ డీలిమిటేషన్ ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, Read more

బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో
బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో

ఫిబ్రవరి 5 ఢిల్లీ ఎన్నికల కోసం బిజెపి తన మ్యానిఫెస్టోలో మొదటి భాగాన్ని శుక్రవారం విడుదల చేసింది, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ప్రతి గర్భిణీ స్త్రీకి Read more