athisha

ప్రభుత్వాన్ని నడిపే సత్తా బీజేపీలో లేదు – ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి

  • సీఎం అభ్యర్థిని ఖరారు చేయలేదని ఎద్దేవా

బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేకపోవడం దాని వైఫల్యాన్ని చూపిస్తున్నది అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి విమర్శించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా, బీజేపీ ఇప్పటికీ సీఎం అభ్యర్థిని ఖరారు చేయలేదని ఆమె ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యం ఉన్న నేతలు బీజేపీలో లేరనేందునే ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

NKV BJP

బీజేపీ గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరిపై కూడా ప్రధాని నరేంద్ర మోదీకి నమ్మకం లేదని అతిషి ఆరోపించారు. దేశ రాజధానిలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నిస్సహాయంగా మారిన పార్టీ ఇక ప్రజల అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తుందని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, త్వరలో సీఎం పేరును ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా, ఈ నెల 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసేందుకు అంత టైమ్ ఎందుకు తీసుకుంటోందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీ రాజకీయాల్లో ఈ అస్పష్టత కొనసాగుతున్న వేళ, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై తన దాడిని ముమ్మరం చేసింది.

Related Posts
వైసీపీలోకి కీలక నేత రీఎంట్రీ..?
kapu ramachandra reddy

గత ఎన్నికల తర్వాత వైసీపీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2019లో 151 స్థానాల్లో ఘన విజయం సాధించిన ఈ పార్టీ, 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే Read more

మహా కుంభమేళాఅగ్ని ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు.
మహా కుంభమేళాఅగ్ని ప్రమాదంపై నరేంద్ర మోదీ స్పందించారు.

ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా ప్రాంతంలో 19 జనవరి ఆదివారం సాయంత్రం ఒక పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదం గ్యాస్ సిలిండర్లు పేలి జరిగినట్టు తెలుస్తోంది.గీతా Read more

వైష్ణో దేవి యాత్ర: 72 గంటల నిరసన
వైష్ణో దేవి యాత్ర: 72 గంటల నిరసన

వైష్ణో దేవి రోప్‌వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కత్రాలో 72 గంటల దిగ్బంధనం మాతా వైష్ణో దేవి రోప్‌వే ప్రాజెక్టు కత్రాలో 72 గంటల దిగ్బంధనాన్ని ఎదుర్కొంది. స్థానిక Read more

అప్పుడే వణికితే ఎలా మంత్రులు..? – కేటీఆర్ ట్వీట్
Will march across the state. KTR key announcement

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన లో ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌ Read more