గెలుపు దిశ గా బీజేపీ!

గెలుపు దిశ గా బీజేపీ.ప్రస్తుతం ఫలితాలు చూస్తే బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 36 స్థానాల మెజార్టీ మార్క్‌ను దక్కించుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. 1993లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడు దశాబ్ధాల తర్వాత మరోసారి ఢిల్లీ శాసనసభలో అధికారాన్ని దక్కించుకోబోతుంది. 2014లో కేంద్రంలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈసారి ఎలాగైనా ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ పనిచేసింది. ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈసారి ఢిల్లీ ఎన్నికలను తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ ప్రధాని ఢిల్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టలేదు. ఈసారి మాత్రం తన పంతం నెగ్గించుకోవాలనే పట్టదలతో తీవ్రంగా శ్రమించారు. చివరకు ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడంతో మూడు దశాబ్ధాల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనుంది. 1993లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలంలో బీజేపీ ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులను మార్చింది.

గెలుపు దిశ గా బీజేపీ

గెలుపు దిశ గా బీజేపీ.ఢిల్లీలో అధికారంలోకి రావడమే కాదు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పోటీచేసిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్‌ను పోటీకి నిలిపింది. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించనప్పటికీ పర్వేష్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా జాట్ సామాజికవర్గానికి చెందిన ఆయనను సీఎం చేస్తారనే ప్రచారం ద్వారా ఆ సామాజికవర్గం ఓట్లను బీజేపీ ఎక్కువుగా ఆకర్షించింది. ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే కేజ్రీవాల్‌పై ఆయన ఆధిక్యం కనబరుస్తున్నారు. పర్వేష్ గెలిస్తే మాత్రం ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. 1996 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 1998 అక్టోబర్ 12 వరకు పర్వేజ్ తండ్రి సాహిబ్ సింగ్‌ వర్మ సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం పర్వేష్ సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.

Related Posts
ప్రశాంత్ కిశోర్‌తో మంత్రి లోకేశ్ భేటీ..!
Minister Lokesh meet with Prashant Kishor.

న్యూఢిల్లీ: మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తో భేటీ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారు. లోకేష్ కేంద్ర మంత్రిని కలవడానికి ముందుగానే లోకేష్ ను Read more

శ్రీహరికోట నుంచి వందో ప్రయోగానికి కౌంట్‌డౌన్
sriharikota

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో గల సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC SHAR) వందో ప్రయోగానికి సిద్ధమైంది.2024 సంవత్సరాన్ని ఒక విజయవంతంమైన మిషన్‌తో పూర్తి చేసిన ఇస్రో.. 2025 Read more

YCP: కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైసీపీ కైవసం
YSRCP wins Kadapa district ZP chairman post

YCP: కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న ఒంటిమిట్ట జడ్పీటీసీ ఆకేపాటి అమర్ నాధ్ Read more

Crime News: ఉత్తరప్రదేశ్‌లో గోరం వ్యక్తిని కాల్చి చంపినా యువకుడు
ఉత్తరప్రదేశ్‌లో గోరం వ్యక్తిని కాల్చి చంపినా యువకుడు

ఉత్తరప్రదేశ్‌లో రంజాన్ ఉపవాసం ప్రారంభానికి ముందే కాల్పుల కలకలం ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో రంజాన్ ఉపవాసం ప్రారంభానికి ముందు ఘోర ఘటన చోటుచేసుకుంది. 25 ఏళ్ల యువకుడు హారిస్ Read more