త్వరలోనే ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 8’ ప్రోమో..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్ రియాల్టీ షో..సౌత్ లోను అంతే సక్సెస్ అవుతూ వస్తుంది. సీజన్..సీజన్ కు అభిమానులను పెంచుకుంటూ , TRP రేటింగ్ పెంచుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా గత తెలుగు సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇక ఈ సీజన్ ఎలా ఉండబోతుందో..ఎవరు హౌస్ సభ్యులు అవుతారో..? అనే ఆసక్తి పెరుగుతూ వస్తుంది.

బిగ్‌బాస్‌ 8 ప్రోమో అతి త్వరలో రానుందంటూ ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 8కి సంబంధించి ప్రోమో రెడీ అయ్యిందని, త్వరలోనే దీనిపై ఆఫీషియన్‌ అనౌన్స్‌మెంట్‌ ఇస్తూ ప్రోమోను రిలీజ్‌ చేసేందుకు బిగ్‌బాస్‌ టీం ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. జూలై ఫస్ట్‌ వీక్‌ ప్రోమో రిలీజ్ కానుందంటూ సోషల్‌ మీడియోలో ఓ అప్‌డేట్‌ చక్కర్లు కొడుతుంది. ఈసారి రెట్టింపు వినోదం అంటూ హెస్ట్ నాగార్జునతో ప్రోమో రిలీజ్‌కు టీం ప్లాన్‌ చేసిందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా సీజన్‌ 7 లాగే.. సీజన్‌ 8ని సరికొత్తగా ప్లాన్‌ చేసిందట బిగ్‌బాస్‌ టీం. ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్క్‌లు, ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న సెలబ్రిటీలను, కామన్‌ మ్యాన్‌, సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయేన్సర్లను హౌజ్‌లోకి దింపుతున్నారట.

ఇక కంటెస్టెంట్‌ లిస్ట్‌లో మొదటగా ‘బ్రహ్మముడి’ సీరియల్‌ కావ్య (ఆలియాస్‌ దీపికా రంగరాజు) పేరు వినిపిస్తుంది. కాగా సీరియల్లో ఉత్తమ కోడలిగా, అనుకువగా కనిపించే కావ్య బయట అల్లరి పిల్ల అనే విషయం తెలిసిందే. షోలో ఆమె చేసే అల్లరి అంతా ఇంతకాదు. ఇక దీపికాను బిగ్‌బాస్‌ హౌజ్‌లో దింపితే ఆమె చేసే ఫన్‌, సందడి బిగ్‌బాస్‌కు ప్లస్‌ అవుతుందని ఆమెను తీసుకునేందుకు బిగ్‌బాస్‌ టీం ప్లాన్‌ చేస్తుంది. మరి ఇందుకు దీపికా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందో లేదో చూడాలి. ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ 8 సెప్టెంబర్‌ ప్రారంభం కానుందని వినికిడి.