A huge scam in Jagananna colonies.. BJP MLA

జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం : బీజేపీ ఎమ్మెల్యే

అమరావతి : బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి జగనన్న కాలనీల భూసేకరణలో భూకుంభకోణంపై విచారణ జరిపించాలని కలెక్టర్ కు వినతపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం జరిగింది. రాష్ట్రంలో రూ.2,500 కోట్ల కుంభకోణం జరిగింది. ధర తక్కువగా ఉన్న భూమవులను గుర్తించి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇచ్చారు. ఆదోని మండలం మండగిరి లో 65 మంది రైతుల నుంచి సేకరించారు. ఎకరా రూ.5లక్షలకు రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం రూ.13 లక్షల నుంచి రూ.23 లక్షలు నేతలు తీసుకున్నారు.

image

బ్యాంకు అకౌంట్ లు ఓపెన్ చేసి పాసుపుస్తకాలు నేతల దగ్గర పెట్టుకున్నారు. ఆదోని నియోజకవర్గంలోనే 23 కోట్లు ప్రభుత్వం ఇస్తే రైతులకు చేరింది 13 కోట్లు మాత్రమే. అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాల్లో ఇలాగే రైతులను మోసాగించి నేతలు నొక్కేశారు. 175 నియోజకర్గాల్లో 2,500 కోట్ల కుంభకోణం జరిగింది. పేద రైతులకు దక్కాల్సిన డబ్బులు వైసీపీ నేతలు తినేశారు. వేలాది మంది రైతులను మోసం చేశారు. జగనన్న కాలనీ భూములకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి రూపాయి రైతుకు చేరాలి. కర్నూలు జిల్లాలో జరిగిన అక్రమాలపై కలెక్టర్ విచారణ జరిపించాలి అని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Related Posts
కేటీఆర్ కు బుద్ధ వెంకన్న కౌంటర్
ఏపీపై నోరు జారిన కేటీఆర్.. బుద్ధా వెంకన్న రిప్లైతో భగ్గుమన్న రాజకీయం

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ చర్చకు దారి తీశాయి. తెలంగాణకు Read more

రష్మిక వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
కర్ణాటక ఎమ్మెల్యే రవికుమార్ గనిగ

రష్మిక వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది.'పుష్ప 2'తో పాటు బాలీవుడ్‌లో 'చావా' సినిమాతో మరో Read more

మంత్రులకు సీఎం దిశా నిర్దేశం.
chandrbabu naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం జరిగిన తరువాత మంత్రులతో వేరుగా భేటీ అయ్యారు.పలు కీలక అంశాలను పేర్కొన్నారు. అందరూ గేర్ మార్చాలని.. పనితీరు మెరుగుపరుచుకోవాలని Read more

జపాన్ మంత్రిపై రష్యా శాశ్వత నిషేధం
Russia imposes permanent ban on Japanese minister

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ వివాదంపై జపాన్ ఆంక్షలకు ప్రతిస్పందనగా, రష్యా తొమ్మిది మంది జపాన్ పౌరులను దేశంలోకి ప్రవేశించకుండా శాశ్వతంగా నిషేధించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ బహిరంగంగా Read more