కేంద్ర మంత్రిగా శ్రీనివాసవర్మ బాధ్యతలు

నరసాపురం లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో విజయం సాధించిన భూపతిరాజు శ్రీనివాసవర్మను కేంద్ర సహాయమంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. ఆయనను ఎన్డీయే సర్కారులో భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయమంత్రిగా నియమించారు. ఈ నేపథ్యంలో, భూపతిరాజు శ్రీనివాసవర్మ నేడు ఢిల్లీలో కేంద్ర సహాయమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను స్థాయికి రావడానికి జాతీయ, రాష్ట్ర నేతలు చాలా మంది సహకరించారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా బాధ్యతలు నిర్వర్తిస్తామన్నారు. ఏపీలో కీలకమైన అంశాలలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శ్రీనివాస వర్మ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై స్పందించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ముందుకెళ్తామన్నారు.

విశాఖ ఉక్కుపై అప్పుడే నిర్ణయం తీసుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధాన పరంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చెందిన టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీయే కూటమిలా అధికారంలోకి వచ్చాం. అందుకే ఈ పార్టీల అధినేతలతో సమావేశం అనంతరం విశాఖ ఉక్కుపై వివరాలు ప్రకటిస్తామని తెలిపారు.