Bhumana Karunakar Reddy కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన

Bhumana Karunakar Reddy : కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన

Bhumana Karunakar Reddy : కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన ఆంధ్రప్రదేశ్‌లో కాశీనాయన క్షేత్రం కూల్చివేత వెనుక అసలు దోషులను బయటకు తీయాలని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాలు సమస్యల్లో కూరుకుపోతున్నాయని విమర్శించారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చివేయడం అంటే హిందూ ధర్మంపై బుల్డోజర్ తో దాడి చేయడమే అని భూమన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఈ ఘటనపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.అటవీశాఖ పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నా, ఆశ్చర్యకరంగా అదే శాఖ అధికారులు కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు చేపట్టడం ఏంటి అని ఆయన నిలదీశారు. పవన్, లోకేశ్ మధ్య భేదాలు భూమన ఆరోపణలు పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మధ్య పూర్తి భేదాభిప్రాయాలున్నాయి అని భూమన వ్యాఖ్యానించారు.

Advertisements
Bhumana Karunakar Reddy కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన
Bhumana Karunakar Reddy కాశీనాయన క్షేత్రం కూల్చివేతపై వైసీపీ ఆందోళన

లోకేశ్ క్షమాపణ చెప్పడం
ఆలయాన్ని పునర్నిర్మిస్తానని హామీ ఇవ్వడం
అదే సమయంలో పవన్ మాత్రం మౌనం వహించడం

ఇవి టిడిపి-జనసేన కూటమిలో అంతర్గత కలహాలకు నిదర్శనమని భూమన కటువచనాలు పేల్చారు.

పవనానంద స్వామి ఎక్కడ – భూమన ప్రశ్న

సనాతన ధర్మ పరిరక్షణ గురించి గట్టిగా మాట్లాడే పవనానంద స్వామి ఇప్పుడు మౌనంగా ఉండటం ఏమిటని భూమన నిలదీశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు మాత్రం ఎందుకు నోరు విప్పడం లేదు అని ఆయన ప్రశ్నించారు.

శ్రీశైలం కూడా టార్గెట్ – భూమన అనుమానం

కాశీనాయన క్షేత్రం టైగర్ జోన్ పరిధిలో ఉందని దేవాదాయ శాఖ మంత్రి చెప్పిన తీరు చూస్తే, రేపు శ్రీశైలం ఆలయాన్నీ కూల్చేస్తారేమోనని అనుమానం కలుగుతోంది అని భూమన ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో, కాశీనాయన ఆలయాన్ని అటవీ చట్టాల నుంచి మినహాయించాలంటూ కేంద్రానికి లేఖ రాశారని ఆయన గుర్తు చేశారు.ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆదేశాలు లేకుండానే కూల్చివేతలు జరిగాయా అని ప్రశ్నించారు.

బీజేపీ మౌనం ఎందుకు


నిజంగా హిందూ ఆలయాల రక్షణకే బీజేపీ పని చేస్తుందా అని భూమన ప్రశ్నించారు. ఈ విషయంలో బీజేపీ ఇప్పటికీ ఎందుకు మౌనం వహిస్తోంది అని ఆయన నిలదీశారు. కూటమి పాలనలో హిందూ ధర్మానికి గడ్డుకాలం ఇప్పటి పాలనలో హిందూ ధర్మం ముప్పుతిప్పలు పడుతోంది అని భూమన విమర్శించారు.కూటమి పార్టీల పని వైసీపీపై బురదజల్లడం మాత్రమే ఇప్పటివరకు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడమే వారి ధ్యేయం

Related Posts
పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు
పోసానిపై పలు స్టేషన్లలో 30 కి పైగా ఫిర్యాదులు

ఒకదాని తర్వాత ఒకటి.. రప్పా.. రప్పా.. కేసులు వెంటాడుతూనే ఉన్నాయ్‌..! చూస్తుంటే త్వరలోనే పోసాని కృష్ణమురళికి కంప్లీట్‌ ఏపీ యాత్ర తప్పేలా లేదు..! ఎక్కడికక్కడ కేసులు ఉండడంతో.. Read more

YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్
YCP మాజీ ఎంపీ ఎంవీవీ ఆస్తులు సీజ్

విశాఖపట్నం వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పై చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆస్తుల దుర్వినియోగం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సత్యనారాయణ యొక్క రూ.44.74 Read more

ఈనెల 17న ఏపీ మంత్రి వర్గ సమావేశం

అమరావతి: ఈనెల 17న మరోసారి ఏపీ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసారు. ముఖ్యమంత్రి నారా Read more

చంద్రబాబు ట్వీట్తో తెలుగు-తమిళుల మధ్య మాటల యుద్ధం!
CBN tweet viral

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు విజయాన్ని ప్రశంసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ వివాదానికి కారణమైంది. ట్వీట్లో గుకేశ్ తెలుగువాడని పేర్కొనడంపై తమిళ నెటిజన్లు Read more

Advertisements
×