“భారత్ ఎఫ్ పిఒ ఫైండర్,” జాతీయ ప్లాట్‌ఫామ్ ను ప్రారంభించిన సమున్నతి

"Bharat F PO Finder," launched a national platform
“Bharat F PO Finder,” launched a national platform

హైదరాబాద్: నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (NAFPO) తో కలసి దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయిన “భారత్ FPO ఫైండర్”ను ప్రారంభించినట్లు భారతదేశ అతిపెద్ద అగ్రి చైన్ ఎనేబులర్ అయిన సమున్నతి ప్రకటించింది. “భారత్ FPO ఫైండర్” అనేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (FPOలు) కు సంబంధించిన ఒక సమగ్ర ఎన్సైక్లోపీడియా. దేశవ్యాప్తంగా 42 వేల ఎఫ్ పీఓలు జాబితా చేయబడ్డాయి. రైతులు, పరిశోధకులు, ఎన్జీఓలు, వాటాదారు లకు క్లిష్టమైన డేటాతో సాధికారత కల్పించడం, ఎఫ్ పీఓల ప్రాచుర్యాన్ని మెరుగుపరచడం, భారతదేశ వ్యవ సాయ పర్యావరణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడాన్ని ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్ఐసీసీ నోవా టెల్‌లో జరిగిన సమున్నతి 4వ జాతీయ సమావేశం సందర్భంగా భారత్ ఎఫ్ పీఓ ఫైండర్ ప్రారంభించ బడింది.

ఎఫ్ పీఓ సదస్సులో జరిగిన ప్రారంభోత్సవంలో సమున్నతి డైరెక్టర్ ప్రవేశ్ శర్మ మాట్లాడుతూ, భారత్ ఎఫ్ పీఓ ఫైండర్‌ను “ఎఫ్ పీఓల కోసం భారతదేశ గూగుల్” అని పేర్కొన్నారు. “ఈ ప్లాట్‌ఫామ్ భారతదేశ మొట్ట మొదటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్షియేటివ్, ఇది భారతదేశ ఎఫ్ పీఓలను ఒకే డిజిటల్ పైకప్పు క్రిందకు తీసుకువస్తుంది” అని ఆయన అన్నారు.భారత్ ఎఫ్ పీఓ ఫైండర్ ప్లాట్‌ఫామ్ సులభరీతి వినియోగదారు ఇంటర్‌ఫేస్‌తో రూపొందించబడింది. ప్రాంతం, పండించిన పంటలు, అందించే సేవలు మరియు మార్కెట్ లింక్‌లు వంటి వివిధ ప్రమాణాల ఆధారంగా ఎఫ్ పీఓ ల కోసం శోధించడానికి వినియోగదారులకు వీలు కల్పిస్తుంది.

సమున్నతి సీఈఓ, వ్యవస్థాపకులు శ్రీ అనిల్ కుమార్ ఎస్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “వ్యవసాయంలో డిజిటల్ పరివర్తన కొనసాగుతోంది. దీనికి కేంద్రబిందువుగా భారత్ ఎఫ్ పీఓ ఫైండర్ ఉండనుంది. వ్యవసాయ ఉత్పత్తి, మార్కెట్ యాక్సెస్ మరియు ఫైనాన్స్‌లో ఉన్నత స్థాయిని సాధించడానికి చిన్న, సన్నకారు రైతులను సమీకరించడంలో ఎఫ్ పీఓ లు కీలక పాత్ర పోషిస్తున్నందున, ఈ ప్లాట్‌ఫామ్ వారి వృద్ధికి తోడ్పడే వాటాదారులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది” అని అన్నారు. ఈ సందర్భంగా, సమున్నతి వ్యవస్థాపకులు, సీఈఓ అనిల్ కుమార్ ఎస్జీ ఫైనాన్సింగ్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ (CSA)పై ఒక సంచలనాత్మక శ్వేతపత్రాన్ని ఆవిష్కరించారు. భారతదేశ వ్యవసాయ రంగం తన సుస్థిరత లక్ష్యాలను చేరుకోవడంలో కీలకమైన దశ అయిన వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ పద్ధతు లకు ఆర్థిక సహాయాన్ని వేగవంతం చేయడానికి అవసరమైన వ్యూహాలను ఈ శ్వేతపత్రం వివరిస్తుంది. ఇది సీఎస్ఏలో ప్రైవేట్ పెట్టుబడులను పెంపొందించడానికి మరియు వాతావరణ ఉపశమన మరియు అనుసరణ సాంకేతికతలలో ఫైనాన్సింగ్ అంతరాలను పరిష్కరించడానికి అవసరమైన సిఫార్సులను కలిగి ఉంది. సమున్నతి ఆశయాన్ని రూపొందించడంలో నాబార్డ్ ముఖ్యమైన పాత్ర పోషించింది మరియు దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి ఎఫ్ పీఓలని ఏర్పాటు చేయడానికి అనిల్ కుమార్ ఎస్జీని ప్రేరేపించింది. ప్రారంభోత్సవంలో భారత ప్రభుత్వ వ్యవసాయ & రైతు సంక్షేమ అదనపు కార్యదర్శి ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ మాట్లాడుతూ, “భారత వ్యవసాయం యొక్క భవిష్యత్తు పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రతను నిర్ధారిస్తూ మారుతున్న వాతావరణాలకు అనుగుణంగా మారే సామర్థ్యంలో ఉంది. ఈ మార్పును సాధించేలా చేయడం లో ఎఫ్ పీఓలు కీలకమైనవి. ఎందుకంటే మన రైతుల ఆర్థిక, పర్యావరణ శ్రేయస్సును నిర్ధారిస్తూ సుస్థిర పద్ధతులను ఉన్నత స్థాయిలో అమలు చేయగల శక్తి వాటికి ఉంది. మనం శీతోష్ణస్థితి మార్పులను తట్టుకో గలిగే వ్యవసాయం కోసం ఫైనాన్సింగ్‌ను వేగవంతం చేయాలి మరియు సమగ్ర, స్థితిస్థాపక వ్యవసాయ రంగా నికి కృషి చేయాలి” అని అన్నారు.

నాబార్డ్ సీజీఎం డాక్టర్ ఏవీ భవానీ శంకర్ భారతదేశంలోని ఎఫ్ పీఓలను మార్కెట్‌కు అనుసంధానించడం ద్వారా వాటిని శక్తివంతం చేయడం మరియు సుస్థిర వ్యవసాయ విధానాలకు సంబంధించి సమున్నతిని అభినందించారు. భారతదేశం సుస్థిర వ్యవసాయ విధానాలు పాటించేలా చేసేందుకు, ప్ర భారతీయ వ్యవసాయ క్షేత్రాల నుండి పంచ స్థాయి ఉత్పత్తులు మార్కెట్‌కు చేరుకోవడంలో సహాయపడటానికి నాబార్డ్ సుస్థిరత, శీతోష్ణస్థితి అనుకూల ఎఫ్ పీఓల నిబంధనలపై పని చేస్తోందని కూడా ఆయన ప్రకటించారు.