bhanu chander ott movie

Bhanu Chander: సీనియర్ హీరో భాను చందర్ కుమారుడిని చూశారా? టాలీవుడ్‌లో క్రేజీ హీరో

సీనియర్ హీరో భాను చందర్ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు 80ల మరియు 90ల దశకాల్లో ఆయన స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన ఈ టాలెంటెడ్ నటుడు తన సహజమైన నటన స్టైల్‌తో ప్రేక్షకులను మెప్పించారు
భాను చందర్ తన సినీ ప్రయాణాన్ని 1978లో వచ్చిన మన ఊరి పాండవులు చిత్రంతో ప్రారంభించారు ఈ చిత్రం ద్వారా ఆయన తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మొదటి చిత్రంతోనే తన ప్రతిభను నిరూపించుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరంగా నిలిచారు ఆ తరువాత వరుస హిట్స్‌తో భాను చందర్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు భాను చందర్ కెరీర్‌కు కీలక మలుపు 1986లో వచ్చిన నిరీక్షణ ఈ సినిమా ఆయనకు యాక్టింగ్ పరంగా మరింత ప్రశంసలు తెచ్చింది ఈ చిత్రంలో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు మాత్రమే కాకుండా పురస్కారాలు కూడా దక్కాయి ఇది ఆయన కెరీర్‌లో ఎంతో ముఖ్యమైన సినిమా

తర్వాతి కాలంలో భాను చందర్ హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ కొన్ని ప్లాప్‌ల కారణంగా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాల్సిది అయినప్పటికీ రెండవ ఇన్నింగ్స్‌లో కూడా తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించారు ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో ఆయన నైపుణ్యం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది భాను చందర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సైతం తన నటనకు స్థానం సంపాదించుకొని వరుస సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు భాను చందర్ తన సినీ వారసత్వాన్ని కొనసాగించేందుకు తన కొడుకు జయంత్ భాను చందర్ కూడా సినిమాల్లోకి అడుగు పెట్టాడు జయంత్ 2013లో నా కొడుకు బంగారం అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ చిత్రానికి భాను చందర్ స్వయంగా దర్శకత్వం వహించారు అయితే సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది జయంత్ లుక్స్ మరియు నటన పరంగా మంచి ప్రశంసలు పొందినప్పటికీ పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు జయంత్ తర్వాతి కాలంలో సినిమా రంగంలో పెద్దగా కనిపించలేదు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ వేరే వ్యాపారాల్లో తాను దృష్టి పెట్టినట్లు సమాచారం జయంత్ సినిమాల నుండి విరామం తీసుకున్నప్పటికీ భాను చందర్ నటనపై ప్రేమ అంకితభావం మాత్రం ఇంకా కొనసాగుతోంది.

Related Posts
శ్రీలీల రిజెక్ట్ చేసిన సినిమాలో పూజాహెగ్డే గ్రీన్‌సిగ్న‌ల్‌
pooja hegde

టాలీవుడ్, బాలీవుడ్, తమిళ సినిమాల్లో వరుసగా కనిపిస్తున్న నటి శ్రీలీల ఇప్పటి వరకు తమిళ సినిమా పరిశ్రమలో తన ముద్రను నిలిపిన విషయం తెలిసిందే. టాలీవుడ్ సినిమాల Read more

రాజమౌళి శాపం వార్నర్‌ను కూడా వెంటాడిందా?
rajamouli 1

సినీ పరిశ్రమలో కొన్ని మూఢనమ్మకాలు తరచూ ప్రచారం అవుతుంటాయి, వాటిలో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోల తరువాతి సినిమాల ఫలితాలపై ఉండే నమ్మకం. ఎస్.ఎస్. రాజమౌళి Read more

విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం.. సోషల్ మీడియా షేక్ అవుతుందిగా
vijay sethupathi wife jessy sethupathi

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన నటన పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంటోంది సహజమైన నటన అందమైన హావభావాలతో ప్రతి పాత్రలో జీవించడం Read more

దర్శన్‌కు బెయిల్.. ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్..
Darshan Case

కన్నడ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరో దర్శన్‌కు శుక్రవారం (డిసెంబర్ 13) బెయిల్ మంజూరైంది.ఈ వార్తను అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలతో స్వాగతించారు.సోషల్ మీడియా వేదికగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *