benjamin netanyahu solidarity message to iranians

ఇరాన్‌ ప్రజలకు ఇజ్రాయెల్‌ ఎప్పటికీ అండగా ఉంటుంది: నెతన్యాహు

benjamin-netanyahu-solidarity-message-to-iranians

ఇజ్రాయెల్‌: హెజ్‌బొల్లా లక్ష్యంగా లెబనాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న వేళ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఇరాన్‌ పౌరులకు సంఘీభావంగా మాట్లాడిన ఆయన.. ఆ దేశ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేశారు. ఆ దేశంలోని నిరంకుశ పాలనను త్వరలోనే అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛావాయువులు అందిస్తామన్నారు. ఇరాన్‌ ప్రజలకు ఇజ్రాయెల్‌ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.

”ప్రతి రోజూ మీ పాలకులు మిమ్మల్ని అణచివేస్తూ గాజా, లెబనాన్‌ను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చూస్తూనే ఉన్నారు. వారి చర్యల కారణంగా మన ప్రాంతం మరింత అంధకారంలోకి వెళ్తోంది. యుద్ధం నానాటికీ తీవ్రమవుతోంది. ఇరాన్‌ నిరంకుశ పాలకులు మీ భవిష్యత్తు గురించి పట్టించుకోవట్లేదని మీలో చాలా మందికి తెలుసు. వారు మీ గురించి ఆలోచించి ఉంటే.. కోట్లాది డాలర్లను మధ్యప్రాచ్యంలో యుద్ధాల కోసం వెచ్చించరు. ఆ డబ్బును అణ్వాయుధాల కోసం కాకుండా.. మీ జీవితాలు బాగు చేసేందుకు ఉపయోగించేవారు. మీ పిల్లల చదువు, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఉపయోగించేవారు. కానీ, మీ పాలకులు అలా చేయట్లేదు” అని నెతన్యాహు వెల్లడించారు.

”హెజ్‌బొల్లాకు చెందిన హంతకులు, అత్యాచారం చేసేవారిని మీరు సమర్థించరని నాకు తెలుసు. కానీ, మీ పాలకులు అలా కాదు. అందుకే, ఇరాన్‌ కీలుబొమ్మలను మేం ఒక్కొక్కటికీ పెకిలించివేస్తున్నాం. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. ఇలాంటి పాలకులు మీకు అక్కర్లేదు. త్వరలోనే ఆ నిరంకుశ పాలన నుంచి మీకు విముక్తి కల్పిస్తాం. అప్పుడు రెండు దేశాల్లో మళ్లీ శాంతి నెలకొంటుంది” అని నెతన్యాహు పరోక్షంగా ఇరాన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

గతేడాది అక్టోబరులో ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపుదాడి తర్వాత మొదలైన యుద్ధం ఇప్పుడు మరింత విస్తరించింది. మొన్నటివరకు గాజాపై భీకర దాడులు సాగించిన నెతన్యాహు సర్కార్‌.. ఇప్పుడు హెజ్‌బొల్లాపై దృష్టిపెట్టింది. ఇప్పటికే ఆ సంస్థ అధినేత నస్రల్లాను అంతమొందించింది. ప్రస్తుతం లెబనాన్ సరిహద్దుల్లో పరిమిత స్థాయిలో భూతల దాడులు మొదలుపెట్టింది. అటు హెజ్‌బొల్లా కూడా దీర్ఘకాల యుద్ధానికి సై అనడం, దీనికి ఇరాన్‌ మద్దతివ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కన్పించట్లేదు.

Related Posts
తువాలూ దేశం మేటావర్స్‌లో పర్యాటక, ఆర్థిక లాభాలు సృష్టించే ప్రణాళిక
Tuvalu

తువాలూ, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న దేశం, 11,000 మంది జనాభా ఉన్నది. ఇప్పుడు సముద్రస్థాయి పెరుగుదల కారణంగా దేశం తుపానుల ధాటికి, ప్రమాదం ఎదుర్కొంటుంది. Read more

నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం
Nitish Kumar Reddy received

టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వస్థలానికి చేరుకున్న ఆయనకు Read more

బంగ్లాదేశ్‌లో హిందు దాడుల నేపథ్యంలో త్రిపురా పర్యాటక సంఘం కీలక చర్య
protest against hindu

ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు రోజురోజుకీ బలహీనమవుతున్నాయి. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల వార్తలు తరచుగా వస్తున్న నేపథ్యంలో, ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత Read more

యువగళానికి రెండేళ్లు..టీడీపీలో సంబరాలు
yuvagalam2yrs

నారా లోకేశ్‌ నాయకత్వంలో ప్రారంభమైన యువగళం పాదయాత్రకు నేటితో సరిగ్గా రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. Read more