bengal doctor back on strike announced total cease work from today

మరోసారి సమ్మె బాట పట్టిన బెంగాల్ వైద్యులు

bengal-doctor-back-on-strike-announced-total-cease-work-from-today

కోల్‌కతా: కోల్ కతాలో ట్రెయినీ డాక్టర్ అత్యాచారం ఘటన తర్వాత ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్లు వారం కిందట తాత్కాలికంగా నిరసన విరమించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీతో నిరసన విరమించిన వైద్యులు.. తాజాగా మళ్లీ ఆందోళన బాట పట్టారు. మంగళవారం నుంచే విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆసుపత్రులలో తమకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సాగోర్ దత్తా మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో ఓ వైద్యుడిపై దాడి జరగడంతో ఆందోళన చేపట్టారు. ఈసారి ఆందోళనను మరింత తీవ్రంగా చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అత్యవసర సేవలు సహా అన్ని సేవలకు దూరంగా ఉండనున్నట్లు వెల్లడించారు.

ఆర్జీ కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం నేపథ్యంలో పనిచేసే చోట తమకు రక్షణ లేకుండా పోయిందని వైద్యులు వాపోతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు మహిళా వైద్యుల భద్రత, డాక్టర్లపై దాడులను అరికట్టేందుకు రక్షణ ఏర్పాట్ల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన వైద్యులతో అప్పట్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపారు. ఆసుపత్రులలో మహిళా వైద్యుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ఆసుపత్రులలో సీసీటీవీ కెమెరాల ఏర్పాట్లు తదితర ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

దీంతో వైద్యులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. అయితే, తాజాగా సాగోర్ దత్తా ఆసుపత్రిలో వైద్యుడిపై దాడి జరగడంతో మళ్లీ ఆందోళన చేపట్టారు. బుధవారం (అక్టోబర్ 2) భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమకు ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వైద్యులు ఆరోపించారు. దీంతో విధులను బహిష్కరించడం మినహా తమకు మరో మార్గంలేకుండా పోయిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆసుపత్రులలో వైద్యుల రక్షణకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Posts
గన్నవరంలో విమాన రాకపోకలకు అంతరాయం..
Disruption of flights in Gannavaram

అమరావతి : గన్నవరం ఎయిర్‌పోర్టును పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు పలు విమానాలు ఆలస్యంగా వస్తున్నాయి. పొగమంచుతో ఢిల్లీ నుంచి వచ్చి ఎయిర్ ఇండియా Read more

వయనాడ్ బరిలో సినీ నటి ఖుష్బూ..?
kushboo

వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికలో సినీ నటి ఖుష్బూను బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీకి ఆమె దీటైన పోటీ ఇస్తుందనే Read more

రష్యా సైన్యంలో భారతీయులందరినీ విడుదల చేయాలి
రష్యా సైన్యంలో భారతీయులందరినీ విడుదల చేయాలి1

ఉక్రెయిన్లో ఘర్షణలో ముందంజలో ఉన్న మరో పౌరుడు మరణించిన తరువాత రష్యా తన సైన్యంలో పనిచేస్తున్న భారతీయ పౌరులందరినీ విడుదల చేయాలని భారత్ మంగళవారం డిమాండ్ చేసింది, Read more

దుర్గ‌మ్మ ను దర్శించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్
pawan durgamma

దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్యతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు, అధికారులు Read more