ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇంట్లో ఇటీవల దొంగతనం చోటుచేసుకుంది పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు జరిగిన ఈ ఘటన గురించి స్టోక్స్ తాజాగా వెల్లడించారు తన కుటుంబం ఇంట్లోనే ఉండగా, ముసుగు ధరించిన దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారని ఆయన చెప్పారు ఈ ఘటనలో తన కుటుంబానికి ఎటువంటి హాని జరగకపోయినా, కొన్ని అతిప్రాధాన్యత కలిగిన సెంటిమెంట్ వస్తువులను దొంగలు అపహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు “అక్టోబర్ 17 సాయంత్రం నా ఈశాన్య లండన్‌లోని కాజిల్ ఈడెన్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు ముసుగులు ధరించి వచ్చి, వారు విలువైన నగలు మరియు ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు దొంగలు ఎత్తుకెళ్లిన వస్తువులలో చాలా నా కుటుంబానికి ఎంతో సెంటిమెంట్‌తో కూడినవి వాటిని తిరిగి పొందడం అసాధ్యం ఈ ఘటన నా కుటుంబాన్ని ఆందోళనకు గురి చేసింది” అని స్టోక్స్ తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
దొంగతనం జరిగిన సమయంలో తన భార్య క్లైర్, ఇద్దరు పిల్లలు లేటన్ మరియు లిబ్బి ఇంట్లోనే ఉన్నారు “నా కుటుంబానికి ఎటువంటి భౌతిక హాని జరగకపోవడం అదృష్టకరం, కానీ మానసికంగా వారిపై ఈ సంఘటన బలమైన ప్రభావం చూపింది ఈ సంఘటన మరింత భయానకంగా మారి ఉండకపోవడం మనం ఊహించడానికే భయంకరంగా ఉంది దొంగిలించిన వస్తువులను గుర్తించడంలో సహకరించాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను” అని స్టోక్స్ పేర్కొన్నారు ఈ ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుండగా, స్టోక్స్ తన ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని ఆలస్యంగా బయట పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది పాకిస్తాన్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ దోపిడీ జరిగింది ఆయన అనుబంధంగా కొన్ని దొంగిలించిన వస్తువుల ఫోటోలు విడుదల చేశారు, వాటిని ఎక్కడైనా చూసిన వారు వెంటనే సమాచారం అందించాలని కోరారు స్టోక్స్ తన కుటుంబానికి ధైర్యం చెప్పి, చోరీ తరువాత వారికి సాయపడ్డ స్థానిక పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. “నా స్వదేశంలో లేనప్పుడు నా కుటుంబానికి మద్దతు ఇచ్చినందుకు పోలీసులకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని స్టోక్స్ పేర్కొన్నారు ఇకపోతే, పాకిస్తాన్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 తేడాతో ఓడిపోయింది.