Barack Obama, Michelle divorce..?

బరాక్ ఒబామా, మిషెల్ విడాకులు..?

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మిచెల్‌ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా త్వరలో విడాకులు తీసుకోనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఒబామా హాజరుకానుండగా ఆయన సతీమణి, మిచెల్ ఒబామా దూరంగా ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Advertisements
image
image

ఈక్రమంలో ఒబామా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, అందువల్లే ఈ కార్యక్రమానికి మిచెల్‌ హాజరు కావడంలేదని ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవల జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి కూడా మిచెల్ హాజరుకాకపోవడంతో ఒబామా దంపతులకు విడాకులు ఖాయమైనట్లు సోషల్‌ మీడియాలో వదంతులు వ్యాప్తిస్తున్నాయి. 2000 సంవత్సరంలోనే మిచెల్‌.. బరాక్‌ ఒబామాకు విడాకులు ఇవ్వాలని అనుకున్నట్లు 2012లో విడుదలైన ఓ పుస్తకంలో వెల్లడించారు. వైవాహిక బంధంలో చిన్న చిన్న మనస్పర్థలు ఎదురయ్యాయని, వాటిని అధిగమించేందుకు తాము కౌన్సెలింగ్‌ తీసుకున్నట్లు ఆ మధ్య మిచెల్‌ ఓ ఇంటర్వ్యూలోనూ తెలిపారు.

కాగా, బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా జోడీ 1989లో డేటింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత 1992లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. కొంతకాలంగా వీరి బంధంలో విభేదాలు మొదలయ్యాయి. వాస్తవానికి గత కొంతకాలంగా బరాక్ ఒబామా దంపతులు ఎక్కడా బహిరంగంగా కలిసి కనిపించింది లేదు. అప్పుడే వీరిద్దరి విడాకుల ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ప్రచారం కాస్తా ఎప్పటికప్పుడు పెరుగుతూ పోయింది. దీనికి తాజా ఘటనలు నిదర్శనంగా నిలిచాయి. దీంతో త్వరలో అధికారికంగా వీరు విడాకుల ప్రకటన చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Related Posts
భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోలు మృతి
Massive encounter.. 10 Maoists killed

రాయ్‌పూర్‌: మరోసారి ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌‌-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్‌ జిల్లాలోని కులారీ ఘాట్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం Read more

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌..!
Strike siren in Telangana RTC..!

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె కు సైరన్ మోగించనున్నారు . ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సమ్మెకు వెళ్లాలని జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు Read more

TDP Leader : ప్రైవేట్ బస్ ఓనర్ల పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం
TDP Leader ప్రైవేట్ బస్ ఓనర్ల పై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాల్లో బస్సుల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. తాజాగా టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రైవేట్ బస్సుల లీజు Read more

Twitter Iconic Bird Logo: ట్విట్ట‌ర్ ఐకానిక్ బ‌ర్డ్.. వేలంలో భారీ ధర
Twitter Iconic Bird Logo: ట్విట్ట‌ర్ ఐకానిక్ బ‌ర్డ్.. వేలంలో భారీ ధర

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా లోగోల్లో ట్విట్ట‌ర్ బ్లూబర్డ్ ఒకటి. అయితే, 2022 అక్టోబర్‌లో ప్రముఖ వ్యాపార దిగ్గజం, Tesla, SpaceX CEO ఎలాన్ మస్క్ Read more

Advertisements
×