సెప్టెంబర్లో ఏకంగా 15 రోజులు బ్యాంకులకు సెలవులు

నెల మారుతుందంటే చాలు అందరికి టెన్షనే. సామాన్య ప్రజలు గ్యాస్ ధర ఎంత పెరుగుతుందో అని..వంట సామాన్ల ధరలు ఎలా ఉండబోతున్నాయో అని , పెట్రోల్ ధరలు తగ్గుతాయా..పెరుగుతాయా..అని ఎదురుచూస్తుంటారు. ఇక బ్యాంకు ఖాతాదారులు కొత్తగా ఏ రూల్స్ వస్తాయో..బ్యాంకు టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయో..అనేది ఎదురుచూస్తుంటారు.

ఇప్పుడు కూడా అలాగే ఎదురుచూస్తున్నారు. మరో ఒక్క రోజు సెప్టెంబర్ నెల రాబోతుంది. దీంతో సెప్టెంబర్ లో ఎన్ని రోజులు బ్యాంకు సెలవులు అనేవి అధికారికంగా వచ్చేసింది. మొత్తం 15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందువల్ల బ్యాంక్ పనులు ఏమైనా ఉంటే, ఇప్పటి నుంచే పక్కాగా ప్లాన్ చేసుకోవడం మంచిది. వీటిలో కొన్ని జాతీయ సెలవులు, మరికొన్ని ప్రాంతీయ సెలవులు ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవాలి.

2024 సెప్టెంబర్​​​ నెలలో బ్యాంక్​ సెలవుల జాబితా చూస్తే..

సెప్టెంబర్​ 1 (ఆదివారం)
సెప్టెంబర్​ 4 (బుధవారం) : శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి పర్వదినం సందర్భంగా అసోంలోని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్​ 7 (శనివారం) : వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్​ 8 (ఆదివారం) : కర్మ పూజ/మొదటి ఓనం సందర్భంగా కేరళ, ఝార్ఖండ్​ రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్​ 14 (రెండో శనివారం) :
సెప్టెంబర్​ 15 (ఆదివారం) :
సెప్టెంబర్​ 16 (సోమవారం) : మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) సందర్భంగా పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్​ 17 (మంగళవారం) : ఇంద్రజాత్ర/ఈద్-ఎ-మిలాద్ (మిలాద్-ఉన్-నబీ) సందర్భంగా సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లలోని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్​ 18 (బుధవారం) : పాంగ్-లాబ్సోల్ సందర్భంగా అసోంలోని బ్యాంకులకు సెలవు.
సెప్టెంబర్​ 20 (శుక్రవారం) : ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ తరువాతి శుక్రవారం సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్​ 21 (శనివారం) : శ్రీ నారాయణ గురు సమాధి దినం సందర్భంగా కేరళలోని బ్యాంకులు పనిచేయవు.
సెప్టెంబర్​ 22 (ఆదివారం) :
సెప్టెంబర్​ 23 (సోమవారం) : మహారాజా హరిసింగ్ పుట్టినరోజు సందర్భంగా జమ్ము, శ్రీనగర్‌లోని బ్యాంకులు పనిచేయవు.
సెప్టెంబర్​ 28 ( నాల్గో శనివారం) :
సెప్టెంబర్​ 29 (ఆదివారం)

15 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్​, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. సో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు.