ఏప్రిల్ లో 10 రోజుల పాటు బ్యాంకులకి సెలవులు

Bank Holidays: ఏప్రిల్ లో 10 రోజుల పాటు బ్యాంకులకి సెలవులు

ఇంకో వారం రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ ముగిసి ఏప్రిల్ నెల మొదలవుతుంది. అలాగే ఏప్రిల్ ఒకటి నుండి కొన్ని రూల్స్ కూడా మారనున్నాయి. అయితే ప్రతినెల ఒకటి తేదీన ఈ మార్పులతో పాటు బ్యాంకులకు సంబంధించిన హాలిడేస్ లిస్ట్ ఆర్బీఐ విడుదల చేస్తుంది. ఈ లిస్ట్ ప్రకారం ఏప్రిల్ నెలలో బ్యాంకుల కార్యకలాపాలకి బ్రేక్ పడనుంది. అంటే ఈ రోజుల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఒక్క ఏప్రిల్ నెలలో మొత్తంగా 10 రోజుల పాటు బ్యాంకులకి సెలవులు ఉండనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తెలిపింది. ఈ తేదీల్లో స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులకి కూడా సెలవులు ఉంటాయి. మీరు ఏదైనా బ్యాంకు సంబంధిత పనులు లేదా మని ట్రాన్సక్షన్ చేయాలనుకుంటే మీరు UPI పేమెంట్ సహాయం తీసుకోవచ్చు. అంతే కాకుండా మీరు ATM నుండి కూడా డబ్బు విత్ డ్రా తీసుకోవచ్చు.

Advertisements
ఏప్రిల్ లో 10 రోజుల పాటు బ్యాంకులకి సెలవులు

ఏప్రిల్‌లో ఎ తేదీల్లో బ్యాంకులు పనిచేయవంటే
శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న బ్యాంకులు మూసివేయబడతాయి. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక హిందూ పండుగ, ఈ రోజున వివిధ దేవాలయాలలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. చాల రాష్ట్రాల్లో ఈ రోజున స్కూల్స్ ఇంకా ఆఫీసులు కూడా మూసివేస్తారు. అలాగే ఏప్రిల్ 10న మహావీర్ జయంతి ప్రభుత్వ సెలవు దినం కారణంగా, ఈ రోజు కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసివేయబడతాయి.
ఏప్రిల్‌లో ఈ తేదీల్లో బ్యాంకులు పని చేయవు
శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 6న బ్యాంకులు మూసివేయబడతాయి. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక హిందూ పండుగ, ఈ రోజున వివిధ దేవాలయాలలో శ్రీరాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. చాల రాష్ట్రాల్లో ఈ రోజున స్కూల్స్ ఇంకా ఆఫీసులు కూడా మూసివేస్తారు. అలాగే ఏప్రిల్ 10న మహావీర్ జయంతి ప్రభుత్వ సెలవు దినం కారణంగా, ఈ రోజు కొన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులు మూసివేయబడతాయి.
RBI మార్గదర్శకాల ప్రకారం
దీని తరువాత ఏప్రిల్ 12న రెండవ శనివారం, దింతో RBI మార్గదర్శకాల ప్రకారం ప్రతినెల రెండో శనివారం బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే ఏప్రిల్ 13 ఆదివారం కాబట్టి బ్యాంకులు ఎప్పటిలాగే మూసివేయబడతాయి. అంతే కాకుండా, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి, ఈ కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో బ్యాంకులు పనిచేయవు. 18 గుడ్ ఫ్రీ డే కారణంగా కూడా హాలిడే ఉంటుంది. గరియా పూజ పండుగ కారణంగా ఏప్రిల్ 21న అగర్తలాలో బ్యాంకులు మూసివేయబడతాయి. ఏప్రిల్ 26 ఏప్రిల్ నెలలో నాల్గవ శనివారం, కాబట్టి భారతదేశం అంతటా బ్యాంకులు మళ్ళీ మూసివేయబడతాయి. శ్రీ పరశురామ జయంతి కారణంగా ఏప్రిల్ 29న బ్యాంకులు మళ్లీ మూసివేయబడతాయి. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 30న బెంగళూరులోని బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ ప్రాంతీయ సెలవులు సాంస్కృతిని హైలైట్ చేస్తాయి ఇంకా చాలా చోట్ల సెలవుగా ప్రకటించబడతాయి.
ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే..
బ్యాంకు సెలవు రోజుల్లో మీరు ఏదైనా ముఖ్యమైన పనులు ఇబ్బందులు లేకుండా చేయాలనుకుంటే ఉదాహరణకు మని ట్రాన్స్ఫర్ ఇంకా బిల్ పేమెంట్స్ వాటి కోసం మీరు బ్యాంక్ అఫీషియల్ వెబ్‌సైట్ సహాయం తీసుకోవచ్చు. అంతే కాకుండా మీరు UPI, మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇతర డిజిటల్ పేమెంట్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే అన్ని హాలిడేస్ రోజుల్లో బ్యాంక్ ఆన్ లైన్ సేవలు ఎప్పటిలాగే యధాతదంగా పనిచేస్తాయి.

Related Posts
ఎండోమెంట్ పరిధిలోకి చార్మినార్ ‘భాగ్యలక్ష్మీ’ అమ్మవారి ఆలయం
charminar bhagyalakshmi

హైదరాబాద్ చార్మినార్ సమీపంలో ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంపై ఎండోమెంట్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఆలయ Read more

ఎస్సీ రిజర్వేషన్లు: కమిషన్ సిఫారసులు ఇవే
reservation

తెలంగాణలో ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి కొత్త మార్పులు ప్రతిపాదించబడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కమిషన్ నివేదికపై ముఖ్యమైన వివరాలు వెల్లడించారు. తెలంగాణలో 15 శాతం Read more

IPL 2025 :సీఎస్‌కే పై కోల్‌కతా భారీ విజయం
IPL 2025 :సీఎస్‌కే పై కోల్‌కతా భారీ విజయం

ఐపీఎల్‌లో ఐదు సార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టుకు 2025 సీజన్ ఆశించినంతగా సాగడం లేదు. సారథి మారినా ఆ జట్టు రాత మారలేదు. Read more

నవదంపతులు అర్జెంటు గా పిల్లల్ని కనండి : స్టాలిన్
నవదంపతులు అర్జెంటు గా పిల్లల్ని కనండి : స్టాలిన్

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలకె కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. గతంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన ఆయన ఇప్పుడు జనాభా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×