బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు..18 కి చేరిన మృతుల సంఖ్య

Bangladesh hotel fire death toll rises to 18

ఢాకా : బంగ్లాదేశ్‌లోని జెస్సోరిలో ఉన్న ఓ హోటల్‌ పై జరిగిన దాడి భారీ అగ్నిప్రమాదానికి దారి తీసింది. దీంతో ఆ ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరుకున్నది. జెస్సోరి ఫైర్ సర్వీస్ అసిస్టెంట్ డైరెకర్టర్ ఎంప మమున్ ఈ విషయాన్ని ద్రుకవీరించారు. షాహిన్ చక్లదార్ అనే వ్యక్తి ఆ హోటల్ ఓనర్‌. అవామీ లీగ్ పార్టీకి చెందిన జెస్సోరీ జిల్లా ప్రధాన కార్యదర్శి అతను.

హోటల్‌కు సాయంత్రం 4 గంటలకు నిప్పుపెట్టారు. దాన్ని రాత్రి 8 గంటలకు ఆర్పారు. అగ్ని ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిని 20 ఏళ్ల చయ్యాన్‌, 19 ఏళ్ల సేజన్ హుస్సేన్‌గా గుర్తించారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకుని అస్వస్థతకు గురైన సుమారు 150 మందిని జెస్సోరీ ఆస్పత్రిలో చేర్పించినట్లు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు.

మాజీ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో.. సోమవారం బంగ్లాదేశ్ లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు.. జెస్సోర్‌లోని చిత్తమోర్ ప్రాంతంలో ఉన్న జాబిర్ హోటల్‌కు నిప్పుపెట్టారు. ఆ హోటల్‌లో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. జిల్లాలోని అవామీ లీగ్ ఆఫీసుతో పాటు అవామీ లీగ్ నేతలకు చెందిన మూడు ఇండ్లపై అటాక్ చేశారు.