Prakash raj :ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ లు ఇచ్చిన బండ్ల గ‌ణేశ్,విష్ణువర్ధన్

Prakash raj :ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ లు ఇచ్చిన బండ్ల గ‌ణేశ్,విష్ణువర్ధన్

సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇది న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కు కౌంట‌ర్‌గానే ట్వీట్ చేసిన‌ట్లు నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

Advertisements

బండ్ల గణేశ్ ట్వీట్

కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే, ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే. ఒక మనిషి జీవితంలో కృతజ్ఞత ఎంత ముఖ్యమో, ద్రోహం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎప్పుడూ కృతజ్ఞతతో జీవించాలి”అని ఆయ‌న ట్వీట్ చేశారు.ఇది చూసిన నెటిజ‌న్లు క‌చ్చితంగా ప్ర‌కాశ్ రాజ్‌ను ఉద్దేశించే గ‌ణేశ్ ఈ ట్వీట్ చేశారని అంటున్నారు. మా ఎన్నిక‌ల స‌మ‌యంలో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ చేసిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్,విష్ణుకు కాకుండా ప్ర‌కాశ్ రాజ్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చారు. అలాంటి ప‌వ‌న్‌పై ఇప్పుడు ప్రకాశ్ రాజ్ సెటైర్లు వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే బండ్ల గ‌ణేశ్ తాజాగా కృత‌జ్ఞ‌త‌గా ఉండాలంటూ ట్వీట్ చేశార‌ని అంటున్నారు. కాగా, నిన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌కాశ్ రాజ్ ఓ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. బ‌హుభాషా విధానంపై ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌కు న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కౌంట‌ర్ ఇచ్చారు. హిందీ భాష‌ను త‌మ‌పై రుద్ద‌కండి అంటూ చెప్ప‌డం ఇంకో భాష‌ను ద్వేషించ‌డం కాద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. స్వాభిమానంతో త‌మ మాతృభాష‌ను, త‌ల్లిని కాపాడుకునే ప్ర‌య‌త్న‌మ‌నే విష‌యాన్ని ప‌వ‌న్‌ కు ద‌య‌చేసి ఎవ‌రైనా చెప్పాల‌ని ప్ర‌కాశ్ రాజ్ కోరారు.

విష్ణువర్ధన్ రెడ్డి స్పందన

హిందీ భాష వద్దు కానీ,హిందీ భాషలో సినిమాలు విడుదల చేసుకోవడం ద్వారా లభించే డబ్బు మాత్రం కావాలా? అంటూ నిన్న తమిళ నేతలపై పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం, పవన్ వ్యాఖ్యలకు ఇవాళ నటుడు ప్రకాశ్ రాజ్ బదులివ్వడం తెలిసిందే. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “మీరు బతకడం కోసం కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలు నేర్చుకున్నారు. హిందీ సినిమాల ద్వారా డబ్బు సంపాదించడం ఓకే కానీ అదే భాషపై ద్వేషాన్ని రెచ్చగొట్టడం తల్లి పాలు తాగి ఆ తల్లికి ద్రోహం చేసినట్లే అవుతుంది. భాషను ప్రేమించడం తప్పు కాదు,కానీ నీలాంటి వాళ్లు రాజకీయ ఓటు బ్యాంకు కోసం భాషను వాడుకోవడం సిగ్గు చేటు” అంటూ ఆయన మండిపడ్డారు.ఈ పరిణామాల నేపథ్యంలో, పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్లు, వాటికి బండ్ల గణేశ్, బీజేపీ నేతల కౌంటర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Related Posts
హీరో విజయ్ దళపతికి వై+ భద్రత
హీరో విజయ్ దళపతికి వై+ భద్రత

తమిళనాడుకు చెందిన ప్రముఖు నటుడు, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ దళపతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వై ప్లస్ Read more

Rammohan Naidu: యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు కు ఎంపికైన రామ్మోహన్ నాయుడు
Rammohan Naidu: యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డు కు ఎంపికైన రామ్మోహన్ నాయుడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇటీవల 'ది ఫోరం ఆఫ్ యంగ్ గ్లోబల్ లీడర్స్' నుండి ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డు Read more

తుఫాన్‌ ఎఫెక్ట్‌..29 రైళ్లు రద్దు : రైల్వే శాఖ ప్రకటన..!
Typhoon effect.29 trains cancelled. Railway department announcement

న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం: తుఫాను కారణంగా పలు మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో దాదాపు Read more

భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష
chanrdrababu

అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ Read more

×