Ban on DJs in Hyderabad

హైదరాబాద్‌లో డీజేల పై నిషేధం

Ban on DJs in Hyderabad

హైదరాబాద్: నగరంలో నిర్వహించే ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్ను నిషేధిస్తూ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయిల్ 100కు ఫిర్యాదులు పెరగడంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల అంశంపై ఇటీవల బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బల్దియా కమిషనర్ ఆమ్రపాలి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజాసింగ్, పాషాఖాద్రీ, ఎంపీ అనిల్కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాచకొండ సీపీ సుధీర్బాబు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సీవీ ఆనంద్ డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండేళ్లుగా డీజేలతో పెద్దయెత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, ఈసారి శృతిమించి జరిగిందని, సీఎం రేవంత్రెడ్డి సైతం దీన్ని గమనించి ఆరా తీశారని సీవీ ఆనంద్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక నుంచి చర్యలు తీసుకుంటామన్నారు.

Related Posts
తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం వివాదం
తమిళనాడు అసెంబ్లీలో జాతీయ గీతం వివాదం

సంవత్సరం మొదటి సెషన్ ప్రారంభం రోజున రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సంప్రదాయ ప్రసంగాన్ని అందించకుండా గవర్నర్ ఆర్‌ఎన్ రవి వాకౌట్ చేశారు. జాతీయ గీతం మరియు రాజ్యాంగం Read more

యూకేలో టెలికామ్ కంపెనీ వినూత్న ప్రయోగం: స్కామర్లను బంధించే AI ‘డైసీ’
ai granny

యూకేలోని ఒక టెలికామ్ కంపెనీ, స్కామర్లతో మాట్లాడడానికి మరియు వారి సమయాన్ని వృథా చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత "డైసీ" అనే వృద్ధ మహిళను ప్రారంభించింది…ఈ Read more

కోల్‌కతా డాక్టర్‌ హత్యాచార కేసు.. నేడు తీర్పు
Kolkata doctor murder case.. Verdict today

కోల్‌కతా : కోల్‌కతాలో ఆర్జీకర్‌ ఆస్పత్రి వైద్యురాలిపై హత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు పై బంగాల్‌లోని సీల్దా కోర్టు Read more

ట్రంప్ ప్రమాణ స్వీకారానికి జయశంకర్
Jayashankar for Trump inauguration

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ ఈరోజు స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అనేక దేశాల నేతలు హాజరు కానున్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న Read more