నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కిస్తోన్న ‘డాకు మహారాజ్‘ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చింది. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి 2025 కి రాబోతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ డాకు మహారాజ్‌తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజాగా శుక్రవారం ‘డాకూస్ రేజ్’ పేరుతో ప్రోమో వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పూర్తి సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. డాకు మహారాజ్ తర్వాత బోయపాటి శ్రీనుతో అఖండ 2 మూవీ చేయబోతున్నాడు బాలకృష్ణ. అఖండకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో అఖండ 2 మొదలైంది. ఈ సినిమాకు బాలకృష్ణ కూతురు తేజస్విని ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోంది.