మందుబాబులకు షాక్ ఇవ్వబోతున్న రేవంత్ సర్కార్..?

తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. తెలంగాణ లో మద్యం అమ్మకాలు ఏ రేంజ్ లో జరుగుతాయో తెలియంది కాదు..ఈరోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయంటే దానికి కారణం మద్యం అమ్మకాల ద్వారా వచ్చే డబ్బుతూనే. ఈ సంవత్సరం లిక్కర్ అమ్మకాల ద్వారా రూ.40 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు. గత ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.36,493 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది.

గత ఆర్థిక సంవత్సరంలో వరుస ఎన్నికలు ఉండటంతో మద్యం అమ్మకాలకు కలిసొచ్చింది. ఎన్నికలలో మద్యం ఏరులై పారింది. రాజకీయ నాయకులు డబ్బుకు లెక్క చేయక అటు కార్యకర్తలు, ఇటు ఓటర్లకు మద్యం వాళ్ల సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఉచితంగా అందించడంతో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి.అయితే ఈ ఏడాది కూడా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు బాగానే ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఆగస్టు 15 తర్వాత మద్యం ధరలు పెంచాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. లిక్కర్ రేట్లు రెట్టింపు చేసి ఆదాయాన్ని భారీగా సమకూర్చుకోవాలని రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది. మరి ఎంత మేర పెంచుతారనేది చూడాలి.